బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తల్లినే చంపేసింది !!
ఒడిశాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రాజ్యలక్ష్మి అనే మహిళ 14 ఏళ్ల క్రితం రోడ్డుపై దొరికిన ఓ పాపను దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచింది. అయితే, ఆ బాలిక పెరిగి పెద్దయ్యాక ఇద్దరు యువకులతో కలిసి, తన పెంపుడు తల్లిని దారుణంగా హత్య చేసింది. పైగా గుండెపోటుతో చనిపోయినట్లు నాటకం ఆడింది. కానీ ఆమె మీద అనుమానం రావడంతో.. పోలీసులు అరెస్ట్ చేశారు. విచారనలో ఆస్తి కోసమే ఈ దారుణానికి ఒడిగట్టిందని తెలిసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
