Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » అభివృద్ధి – సంక్షేమమే టిడిపి లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి – సంక్షేమమే టిడిపి లక్ష్యం

apanalysisBy apanalysisMay 23, 2025No Comments4 Mins Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

మహానాడులో మారుమోగిన నినాదం

మచిలీపట్నంలో టిడిపి జిల్లా మహానాడు

 అవినీతిలో వాటాలు పంచుకున్న వైసిపి -మంత్రి సుభాష్

టిడిపి శతాబ్ద కాలం పాటు వర్ధిల్లుతుంది- మంత్రి కొల్లు రవీంద్ర

బాబు ఆశయం గొప్పది –  ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల

జగన్ తో చేతులు కలిపి జైలు పాలయ్యారు –  వర్ల రామయ్య

కృష్ణా జిల్లా మహానాడులో పలు తీర్మానాలు ఆమోదం

ఏపీ స్టేట్ బ్యూరో,

అభివృద్ధి –  సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఆ పార్టీ నాయకులు ముక్త కంఠంతో పేర్కొన్నారు. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం శుక్రవారం మచిలీపట్నంలోని సత్య కన్వెన్షన్ లో జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తదితర నాయకులు ప్రసంగించారు .ఈ సందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే టిడిపి లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నినాదంతో మహానాడు ప్రాంగణం మారుమోగింది. జిల్లా ఇన్చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ గత వైసీపీ పాలన లో సీఎం జగన్మోహన్ రెడ్డి తో సహా ఆ పార్టీ నాయకులు అంతా అవినీతిలో వాటాలు పంచుకు తిన్నారన్నారు. ఫలితంగా నే ప్రజలు వారిని తరిమికొట్టారన్నారు . ఆ పార్టీ నిండా అడ్డ గాడిదలున్నాయని వారికి గాడ్ ఫాదర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారన్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా కృష్ణా జిల్లా ఫలితాల కోసం ఎదురు చూశారన్నారు . ఈ జిల్లాలో గల వైసిపి కంచర గాడిదల  ఓటమి కోసం జనం నిరీక్షించారన్నారు. ఆ పార్టీ కి చరమ గీతం పాడి టిడిపి కి బ్రహ్మరథం పట్టారన్నారు.

టిడిపి శతాబ్ద కాలం పాటు వర్ధిల్లుతుంది- మంత్రి కొల్లు రవీంద్ర

తెలుగుదేశం పార్టీ అతిపెద్ద సంస్థొగత పార్టీ అని ఈ పార్టీ శతాబ్ద కాలం పాటు వర్ధిల్లుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దేశంలోనే కోటి సభ్యత్వం గల ఏకైక పార్టీగా తెలుగుదేశం పార్టీ రికార్డు సృష్టించిందన్నారు .ఎన్టీఆర్ ఆలోచనకు తగ్గట్టుగా ఆయన అడుగుజాడల్లో పార్టీ పని చేస్తుందన్నారు .గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని నాటి నుంచి నేటి వరకు పటిష్టమైన రీతిలో నడిపిస్తున్నారన్నారు.ఆదినుంచి పార్టీకి కార్యకర్తలే అండగా ఉన్నారన్నారు. టిడిపి ఒక ఫ్యాక్టరీ లాంటిదని రాజకీయ నాయకులను ఆ ఫ్యాక్టరీ తయారు చేస్తుందన్నారు .

సూపర్ సిక్స్ లో భాగంగా ఇప్పటికే పింఛను పెంపుదల జరిగిందని ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరుగుతుందని అన్న క్యాంటీన్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. పాఠశాలలు పునః ప్రారంభం నాటికి తల్లికి వందనం , ఆగస్టు 15 నాటికి ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తామన్నారు.

రాష్రంలో తెలుగు దేశం ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పథకాలపై కార్యకర్తలు విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఇంటింటికి ఈ ప్రచారం చేరాలన్నారు. రాష్ట్రంలోని  అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎమ్ఈడి ఏర్పాటు చేసి పారిశ్రామిక అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు కృష్ణాజిల్లాలో రెండు ఎకరాల స్థలంలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.. ఇందుకోసం మచిలీపట్నం నియోజకవర్గం  నుంచి కోటి రూపాయలు విరాళాన్నీ మంత్రి రవీంద్ర మహానాడులో ప్రకటించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యాలయ  నిర్మాణానికి సహకరించాలని ఆయన కోరారు. రాజధాని అమరావతి నుంచి మచిలీపట్నం పోర్టు వరకు ల్యాండ్ వాటర్ వేస్ సిస్టమ్ ను ప్రవేశపెడతామన్నారు. పోర్టు లున్న రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో మచిలీపట్నం పోర్టుతో అమరావతి అదేవిధంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరు శాతం ఫలితాలు సాధించేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాల్సిన అవసరాన్ని మంత్రి రవీంద్ర గుర్తు చేశారు.

బాబు ఆశయం చాలా గొప్పది -ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల

        రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయం చాలా గొప్పదని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. కాంగ్రెసేతర తొలి ముఖ్యమంత్రిగా ఎన్టీ  రామారావు ప్రపంచ వ్యాప్తంగా కీర్తించబడ్డారన్నారు .ఆ స్ఫూర్తి తోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారన్నారు .ఆయన  ఆశయం చాలా గొప్పదన్నారు. క్రమశిక్షణ గల పార్టీగా టిడిపికి పేరుందని పార్టీ నాయకులు కార్యకర్తలు నాటి నుంచి నేటి వరకు అదే బాటలో నడుస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టకముందు  ఉన్నత వర్గాలకు మాత్రమే రాజకీయం పరిమితంగా ఉండేదని తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత అన్ని వర్గాల ప్రజలకు రాజకీయ పదవులు దక్కేయన్నారు .అందుకు నాంది పలికిన ఎన్టీ రామారావు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.  

జగన్ తో చేతులు కలిపి జైలు పాలయ్యారు –  వర్ల రామయ్య

 గత ఐదేళ్లలో అవినీతి పాలనకు అవధులు లేకుండా పోయాయని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. జగన్ తో చేతులు కలిపి అనేకమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జైలు పాలయ్యారన్నారు. ఐపీఎస్ అధికారి సిఎస్ఆర్ ఆంజనేయులు ,ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ,శ్రీలక్ష్మి లు ఇందుకు ఉదాహరణగా కనిపిస్తున్నారన్నారు .జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు రాష్ట్రంలో అవినీతి పాలన సాగిస్తే చంద్రబాబు నాయుడు అవినీతి రహిత పాలన కొనసాగిస్తున్నారన్నారు .వైసిపి పాలనలో అవినీతికి పాల్పడ్డ ప్రతి పందికొక్కు కు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదన్నారు.ఆ పార్టీ నాయకుల అవినీతిని కక్కిస్తామన్నారు ..ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్  బూరగడ్డ కృష్ణ తేజ అవనిగడ్డ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి కనపర్తి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కొనకళ్ళ జగన్నాథరావు( బుల్లయ్య) బొంతు చిన్నా  గోపు సత్యనారాయణ గొర్రిపాటి గోపీచంద్  మూల్పూరి  కళ్యాణి  గోపాలకృష్ణ  కుర్రా నరేంద్ర  బత్తిన దాసు లోగిశెట్టి వెంకటస్వామి బచ్చుల అనిల్  కాగిత వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Post Views: 47
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

గోదాదేవి కళ్యాణం

January 14, 2026

రాయల్ సర్వీస్ ట్రస్ట్

January 5, 2026

మన్నవ

December 30, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.