రాజధాని అమరావతిలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణంపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. స్థలం రాగానే నిర్మాణం చేపడతామని చెప్పారు. ఆదివారం విజయవాడలోని ఓ హోటల్‌లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో స్టేడియం కోసం 65 ఎకరాలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరామన్నారు. లక్ష మంది కూర్చునేలా అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మించాలని భావిస్తున్నామని చెప్పారు. 45 రోజుల్లోనే విశాఖపట్నంలో 2 ఐపీఎల్ మ్యాచ్‌లు విజయవంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.

| ReplyForwardAdd reaction |
