ప్రభుత్వ ఆహ్వానం
ఏపీ స్టేట్ బ్యూరో,
అమరావతి పనుల పునఃప్రారంభానికి రావాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం పంపింది. ప్రధాని చేతులమీదుగా జరిగే కార్యక్రమానికి రావాలని ఆయన్ని ఆహ్వానించింది. తాడేపల్లి నివాసంలో జగన్ అందుబాటులో లేకపోవడంతో ఆయన పీఎస్‌కు అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ కార్యక్రమానికి జగన్ హాజరుకావాలని కోరుకుంటున్నామని మంత్రులు తెలిపారు. ముఖ్యమైన కార్యక్రమానికి అన్ని పార్టీల భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం పేర్కొంది.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ రాజధానిలో చేపట్టే రూ.49,040 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీనితో పాటు రాష్ట్రంలోని డీఆర్‌డీవో, డీపీఐఐటీ, ఎన్‌హెచ్‌ఏఐ, రైల్వేకు సంబంధించి రూ.57,962 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
