అర్జాకు అందలం
ఢిల్లీ లో ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ గా ఉత్తర్వులు
ఏపీస్టేట్ బ్యూరో.
సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైపుణ్య అభివృద్ది శాఖ సిఇవో గా వ్యవహరించిన పూర్వ ఐఆర్టిఎస్ అధికారి డా.అర్జా శ్రీకాంత్ ను కూటమి ప్రభుత్వం ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ భవన్ కు స్పెషల్ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లు కొనసాగుతారు.
ఇక నుంచి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ కు వచ్చే పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, ఇతర అధికారులకు సంబంధించిన వ్యవహారాలు ఆయన చూసుకుంటారు! అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే వివిధ స్కీమ్స్ ను పర్యవేక్షించి సకాలంలో రాష్ట్రానికి అందేలా చూసే బాధ్యత అప్పగించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వ్యవహారాలు శ్రీకాంత్ చూసుకుంటారు.
గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ విభాగం ద్వారా ఎందరో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాల బాట పట్టించిన అర్జా శ్రీకాంత్ మంచి గుర్తింపు పొందారు. అంతకు ముందు సాంస్కృతిక శాఖ ద్వారా కళాకారులను ప్రోత్సహించి దేశ విదేశాల్లో తెలుగు సాంస్కృతిక పరిమళాలు వెదజల్లారు! తన సొంత ఊరు ను దత్తత తీసుకుని అద్భుతంగా అభివృద్ధి చేశారు. ముఖ్యంగా వెనకబడిన యానాదులు, ఎరుకల వారి అభివృద్ధికి విశేష కృషి చేశారు. లాక్ డౌన్ సమయంలో కోవిడ్ నోడల్ అధికారిగా అప్పటి ముఖ్యమంత్రి వై.యస్.జగన్ ప్రత్యేకంగా అర్జా శ్రీకాంత్ ను నియమించారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది వలస కార్మికులను వారి సొంతూళ్లకు పంపించడంలో విశేష కృషి చేసి అందరి అభినందనలు అందుకున్నారు.
