Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » ఆర్మీలో మహిళలను జడ్జి, అడ్వకేట్‌ జనరల్‌ (లీగల్‌) పోస్టుల్లో ఎందుకు నియమించడం లేదు.
క్రీడలు

ఆర్మీలో మహిళలను జడ్జి, అడ్వకేట్‌ జనరల్‌ (లీగల్‌) పోస్టుల్లో ఎందుకు నియమించడం లేదు.

apanalysisBy apanalysisMay 14, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం

భారత వైమానిక దళంలో మహిళలు రాఫెల్‌ యుద్ధ విమానాన్ని నడపగలిగినపుడు, వారిని ఆర్మీలోని జడ్జి అడ్వకేట్‌ జనరల్‌ (లీగల్‌) పోస్టుల్లో ఎందుకు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టు బుధవారం కేంద్రాన్ని నిలదీసింది. ఈ పోస్టుల్లో మహిళలు తక్కువగా ఉండటంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఈ పోస్టులకు 50-50 నిబంధన వర్తించినప్పటికీ మహిళలను ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది.

ఇద్దరు మహిళా అధికారులు అష్నూర్‌ కౌర్‌, ఆస్థ త్యాగిలు దాఖలు చేసిన పిటిషన్‌పై మే 8న జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం తమ తీర్పును రిజర్వ్‌ చేసింది. ఆ ఇద్దరు అధికారులు ఆర్మీలోని జడ్జి అడ్వకేట్‌ జనరల్‌ లీగల్‌ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల్లో వరుసగా 4,5 ర్యాంకులు సాధించారు. పురుషుల కన్నా మెరిట్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ, మహిళలకు కేటాయించిన ఖాళీలు తక్కువగా ఉండటం వలన జెఎజి విభాగానికి తమను ఎంపిక చేయలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. మహిళలు మరియు పురుషులకు అసమానంగా ఉన్న ఖాళీలను ఈ పిటిషన్‌లో సవాలు చేశారు. మొత్త ఆరు పోస్టుల్లో మహిళలకు మూడు ఖాళీలు మాత్రమే ఉన్నందున వారిని ఎంపిక చేయలేమని అధికారులు చెప్పారని అన్నారు.

భారత వైమానిక దళంలో ఒక మహిళ రాఫెల్‌ యుద్ధ విమానం నడపడానికి అనుమతి ఉంటే, జెఎజిలో ఎక్కువ మంది మహిళలను అనుమతించడం ఆర్మీకి కష్టం ఏముందని కేంద్రాన్ని ప్రశ్నించింది. లింగబేధంతో సంబంధం లేకుండా తటస్థ పోస్టులైనప్పటికీ.. మహిళలకు ఎందుకు తక్కువ పోస్టులు కేటాయించారని ప్రశ్నించింది. పురుషులు-మహిళలు ఆధారంగా ఖాళీలను విభజిచడం వలన అధిక అర్హత కలిగిన మహిళా అభ్యర్థులను తీసుకోనపుడు.. పోస్టులను లింగ తటస్థ పోస్టులను ఎందుకు పిలుస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. 10మంది మహిళలు జెఎజికి అర్హత సాధిస్తే..వారందరినీ జెఎజి బ్రాంచ్‌ అధికారులుగా నియమిస్తారా అని జస్టిస్‌ మన్మోహన్‌ ప్రశ్నించారు.

Post Views: 30
మహిళలు రాఫెల్‌ యుద్ధ విమానాన్ని నడపగలిగినపుడు
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

పిల్లిమొగ్గల రియల్

October 25, 2025

సోషల్ మీడియాతో జర జాగ్రత్త .

October 18, 2025

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో

July 30, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.