ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ల కు సూచనలు
ఏపీ స్టేట్ బ్యూరో
స్థూల విలువ జోడింపు ఎక్కువగా ఉన్న ఉద్యాన సాగుపై రాబోవు 10 సంవత్సరాల్లో ఎక్కువగా దృష్టి పెట్టండని వ్యవసాయ సహకారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ సూచించారు. బుధవారం ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ల శిక్షణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో వారికి పలు సూచనలు చేశారు. ప్రధానంగా
రాష్ట్ర జీడిపి లో 35 శాతం వాటా ప్రాథమిక రంగానిదేనని, ఆ రంగంలోని అన్ని అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వ్యవసాయ పంటల సాగు నుండి రైతులను ఉద్యాన పంటల సాగు మళ్లింపునకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలన్నారు. తక్కువ నిల్వ కాలపరిమితి కలిగి వాటిని, నిల్వ చేసుకునే సౌకర్యం లేని పంటలకు నూతన ఉత్తమ పద్ధతులు ప్రవేశపెట్టాలన్నారు. ప్రకృతి వ్యవసాయం వైపు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆ విధానం విబిన్న వాతావరణ పరిస్థితులకు తట్టుకుని దిగుబడులను నిలకడగా సాధిస్తాయని చెప్పారు. ప్రస్తుత మార్కెట్ ధరలలో గరిష్టంగా వున్న పంటల పై తదుపరి సీజన్ లలో మితిమీరి ఆ పంటలను సాగు చేయకుండా రైతులకు సూచనలు చేయాలన్నారు. 2024 బ్యాచ్ కు సంబంధించి వివిధ ఏడు జిల్లాలో అసిస్టెంట్ కలెక్టరులుగా పనిచేస్తున్న ట్రైనీ కలెక్టర్ లకు వ్యవసాయ సంచాలకులు ఢిల్లీరావు వ్యవసాయ విస్తరణ ,వనరుల పంపిణీ ,ఎరువులు ,విత్తనాలు నాణ్యతా ప్రమాణాలు,ని యంత్రణ ,రాష్ట్ర ,జాతీయ స్థాయి వ్యవసాయ పథకాలు ,రైతు సంక్షేమ పథకాలను వివరించారు.
