వచ్చాడంటే పరిష్కారం కావాల్సిందే..
అదే పవన్ స్టయిల్
నిధులు విడుదల, పనుల ప్రారంభానికి ఆదేశాలు
దివి సీమ ప్రజల కల సాకారం
బ్రిడ్జి నిర్మాణానికి అంగీకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఏపీ ఎనాలసిస్, అవనిగడ్డ
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ కొత్త వరవడిని .సృష్టిస్తున్నారు. ఆరు నెలల క్రితం గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అక్కడి రహదారి సౌకర్యాలు లేకపోవడాన్ని,. గిరిజన మహిళలు పాద రక్ష్లలు లేకుండా నడవడం గమనించారు. అమరావతి వచ్చిన వెంటనే ఆ గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యాల కల్పనకు నిధులు మంజూరు అయ్యాయి. అదే విధంగా తన సొంత నిధులతో గిరిజన మహిళలకు పాదరక్ష్లలు అందాయి. అదే రీతిలో వారం క్రితం తుపాను బాధితుల పరామర్శకు అవనిగడ్డ, తదితర ప్రాంతాలకు వెళ్లారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాని ఎదురుమొండి సమస్యను అక్కడి ప్రజలు వివరించారు. సీన్ కట్ చేస్తే బుధవారం తన చాంబరులో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమస్య పరిష్కారానికి నాబార్డు నిధులు మంజూరుకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
.ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, అవనిగడ్డ ఎం ఎల్ ఏ బుద్ధ ప్రసాద్, కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఆర్ అండ్ బి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గతంలో మంజూరు అయిన రూ. 109 కోట్లకు అదనంగా అవసరం అయిన మరో రూ. 51 కోట్లను నాబార్డ్ ద్వారా మంజూరు చేయించడానికి ఉప ముఖ్యమంత్రి అంగీకరించరు. త్వరలో నిధులు మంజూరు అయి పనులు ప్రారంభం అవుతాయి. ఎదురు మొండి బ్రిడ్జికి నిధులు మంజూరు చేసినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఎంపీ బాలశౌరి, అవనిగడ్డ ఎం ఎల్ ఏ బుద్ధ ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు.
