25 లక్షల మంది అవుట్ పేషెంట్లకు వైద్యం.
త్వరలో బోన్ మారో మార్పిడి
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ.
మంగళగిరిలో నెలకొల్పిన ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్) అందిస్తున్న వైద్య సేవలు రికార్డు స్థాయికి చేరాయి. 25 లక్షల మంది అవుట్ పేషెంట్లకు వైద్యం అందించిన ఘనత ఎయిమ్స్ సాధించింది. ఈ ఇన్స్టిట్యూట్లో త్వరలో బోన్ మారో (ఎముక మూలుగ) మార్పిడి చికిత్స ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి .ఈ వైద్య సేవలు దేశంలో కేవలం 11 హాస్పిటల్స్ లో మాత్రమే ఇప్పటివరకు అందుబాటులో ఉన్నాయి .ఇకపై మంగళగిరి ఎయిమ్స్ లో ఈ చికిత్స అందుబాటులోకి రానుంది.ఇదిలావుండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా 11 సూపర్ స్పెషాలిటీస్ వైద్య సేవలు ఎయిమ్స్ లో ప్రవేశ పెట్టడం గమనార్హం .ఇందుకోసం రాష్ట్ర మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేసినట్టు తెలుస్తోంది.చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించి ఎయిమ్స్ సాధించడమే కాకుండా రికార్డ్ వేగంతో వారికి భూములు కేటాయించారు. ఆసుపత్రి నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా సింగిల్ విండో ద్వారా అన్ని అనుమతులు జారీ చేసి వెన్నుదన్నుగా ఉన్నారు. స్నాతకోత్సవం రోజున ఎయిమ్స్ వైద్యులు అడిగిందే తడవుగా స్పాట్ లో మరో 10 ఎకరాలు కేటాయించారు. ఫలితంగా ఇవాళ మంగళగిరి ఎయిమ్స్ దేశంలోనే టాప్ స్థాయికి చేరింది.. పేదలకు 10 రూపాయలకే ఓపీ చూస్తున్నారు. బయట 5 వేల రూపాయలు ఖర్చయ్యే స్కాన్ ఇక్కడ 500 లకే చేయించుకోవచ్చు. 2024 జూన్ లో కూటమి అధికారంలోకి రాగానే కేవలం 40 రోజుల్లో ఆత్మకూరు చెరువు నుండి ఎయిమ్స్ కి నేరుగా పైప్ లైన్ వేసి మంత్రి లోకేష్ నీటి సమస్య తీర్చడంతో ఎయిమ్స్ కు జీవం పోసినట్లు అయింది.
