Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » ఎలక్ట్రిక్ బస్సులు
ఆంధ్రప్రదేశ్

ఎలక్ట్రిక్ బస్సులు

apanalysisBy apanalysisJune 11, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

విజయవాడ-గుంటూరు

ఏపీ ఎనాలిసిస్, మంగళగిరి

విజయవాడ, గుంటూరు మధ్య ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటుంది. మంగళగిరికి 50, గుంటూరుకు 100 బస్సులు కేటాయించనున్నారు. మంగళగిరి ఆర్టీసీ డిపోలో ఛార్జింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం MTMC కేంద్రంగా 7 మెగావాట్ల సామర్థ్యంతో ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు విద్యుత్ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగా.. విద్యుత్ సరఫరా చేస్తోంది. గంటూరు జిల్లా పాతూరులో 1.8 మెగావాట్ల సామర్థ్యంతో ఒక ప్రైవేటు సంస్థ 60 బస్సులకు ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యంతో ఛార్జింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా కాజాలో 3 కేంద్రాలు ఉన్నాయి.. ఇక్కడ ఒక్కో కేంద్రంలో 250 కిలోవాట్ల సామర్థ్యం ఉంది. కుంచనపల్లిలో 2, ఆత్మకూరులో 1, పెదవడ్లపూడిలో ఒక కేంద్రాలను ప్రైవేటు సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే రెండు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి.. మిగిలినవి కూడా పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఇక్కడ ఒక్కో ఛార్జింగ్ గన్‌కు 45 కిలోవాట్ల సామర్థ్యం ఉండగా.. ఈ మేరకు అక్కడ అవసరానికి తగ్గట్టుగా మరికొన్ని గన్‌లను ఏర్పాటు చేసుకుంటారు. అమరావతిలో రాజధాని పనులు చేస్తున్న మరో కంపెనీ కూడా కృష్ణాయపాలెంలో ఛార్జింగ్ సెంటర్ కావాలని దరఖాస్తు చేసుకుంది. ఛార్జింగ్ చేయడానికి యూనిట్‌కు రూ.7 మాత్రమే వసూలు చేస్తోంది. ఎంత వాడుకున్నా యూనిట్‌కు రూ.7 మాత్రమే వసూలు చేస్తారు.మంగళగిరికి మొదటి దశలో ఆర్టీసీ 50 బస్సులు రానున్నాయి.. గుంటూరుకు 100 బస్సులు కేటాయించనున్నారు. ఆ తర్వాత మెల్లిగా వీటి సంఖ్య పెరగనుంది. అటు గుంటూరు డిపోకు కూడా ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి.

Post Views: 31
electrical Buses between vja-gtr rtc ready to start these services
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

గోదాదేవి కళ్యాణం

January 14, 2026

రాయల్ సర్వీస్ ట్రస్ట్

January 5, 2026

మన్నవ

December 30, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.