ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar) సమీక్ష నిర్వహించారు. ముగ్గురు సీఎండీలు, జిల్లాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఎల్లో అలెర్ట్ దృష్ట్యా అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. వర్ష ప్రభావిత ప్రాంత అధికారులతో ఆయన మాట్లాడారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని గొట్టిపాటి ఆదేశించారు. ప్రజలకు సమస్యలు లేకుండా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. వర్షాల వల్ల కూలిన కరెంటు స్తంభాల పునరుద్ధరణ వెంటనే చేపట్టాలన్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు
