ఏపీలో మరికొన్ని నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. తాజాగా 31 పదవుల భర్తీకి సంబంధించిన జాబితా విడుదలైంది. ఇప్పటికే పలు దఫాలుగా మార్కెట్ కమిటీలు సహా కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టుల వివరాలివీ..
రాష్ట్ర షెడ్యూల్డ్ కాస్ట్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – ఆకేపోగు ప్రభాకర్ (కొడుమూరు-ఎస్సీ) (తెదేపా)
సామాజిక సంక్షేమ బోర్డు- బాల కోటయ్య (నందిగామ-ఎస్సీ)-(బహుజన జేఏసీ)
కమ్మ కార్పొరేషన్- బ్రహ్మం చౌదరి, గురజాల (తెదేపా)
బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్- బుచ్చి రాంప్రసాద్, గుంటూరు వెస్ట్ (తెదేపా)
ముదలియార్ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ – సి.ఎస్. త్యాగరాజన్- చిత్తూరు (తెదేపా)
బొందిలి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్- డి.విక్రమ్ సింగ్, కర్నూలు (తెదేపా)
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (HDPT)- దాసరి శ్రీనివాసులు, తిరుపతి (భాజపా)
వడ్డీ అభివృద్ధి కార్పొరేషన్- గుంటసల వెంకట లక్ష్మి, దెందులూరు (జనసేన)
ఆరెకటిక / కటిక / ఆరే- సూర్యవంశీ సంక్షేమ, అభివృద్ధి సంఘం- హరికృష్ణారావు హనుమంతకరి, తాడిపత్రి (తెదేపా)
విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ – కమ్మరి పార్వతి- పాణ్యం(తెదేపా)
కుంచిటి వక్కలిగ, వక్కలిగర, కుంచిటిగ సంక్షేమ- అభివృద్ధి సంఘం- లక్ష్మీనారాయణ, మడకశిర (ఎస్సీ) (తెదేపా)
నగరాలు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ – మరుపిల్ల తిరుమలేశ్వరరావు, విజయవాడ వెస్ట్ (తెదేపా)
పాల-ఏకరి, ఏకిల, వ్యాకుల, ఏకిరి, నాయనివారు, పాలెగారు, తోలగారి, కవలి సంక్షేమ, అభివృద్ధి సంఘం-నాగేశ్వర నాయుడు కందూరి, రాయచోటి (తెదేపా)
నూర్‌బాషా/ దూదేకుల కార్పొరేషన్- నాగుల్ మీరా కాసునూరి, విజయవాడ వెస్ట్ (తెదేపా)
కురాకుల, పొందర సంక్షేమ, అభివృద్ధి సంఘం-నరసింహులు దామోదర, నరసన్నపేట (తెదేపా)
వికలాంగులు, వృద్ధ పౌరుల సహాయ కార్పొరేషన్- నారాయణ స్వామి, రాప్తాడు(తెదేపా)
కనీస వేతన సలహా బోర్డు- పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, కోవూరు (తెదేపా)
మాంసం అభివృద్ధి కార్పొరేషన్- ప్రకాశ్ నాయుడు, సింగనమల (ఎస్సీ)-తెదేపా
తెలుగు, సంస్కృత అకాడమీ- ఆర్.డి.విల్సన్- నెల్లూరు సిటీ (భాజపా)
సగర /ఉప్పర సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్- ఆర్.వెంకట రమణప్ప, పెనుకొండ (తెదేపా)
నాగవంశం సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్- రామనారాయణ రావు ఎరుబోతు, విజయవాడ సెంట్రల్ (తెదేపా)
కళింగ కోమటి/ కళింగ వైశ్య సంక్షేమ, అభివృద్ధి సంఘం- రమేష్ మొదలవలస, ఆమదాలవలస (తెదేపా)
సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ-రవి మందలపు, రాజమహేంద్రవరం సిటీ (తెదేపా)
వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక కార్పొరేషన్- రెడ్డి అనంత కుమారి, కొత్తపేట (తెదేపా)
బెస్త సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్- శ్రీధర్ బొమ్మన, సూళ్లూరుపేట (ఎస్సీ) (తెదేపా)
ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ- షేక్ రియాజ్, ఒంగోలు(జనసేన)
జానపద కళలు&సృజనాత్మకత అకాడమీ- వంపూరు గంగులయ్య, పాడేరు-ఎస్టీ (జనసేన)
వీరశైవ లింగాయత, లింగబలిజ సంక్షేమ అభివృద్ధి సంఘం-స్వప్న, అనంతపురం అర్బన్ (తెదేపా)
కృష్ణబలిజ /పూసల సహకార ఆర్థిక కార్పొరేషన్ లిమిటెడ్- త్రిమూర్తులు గంటా, భీమవరం (తెదేపా)
జంగం సంక్షేమ, అభివృద్ధి సంఘం- వి.చంద్రశేఖర్, పీలేరు(తెదేపా)
దాసరి సంక్షేమ, అభివృద్ధి సంఘం- వెంకట రత్నాజీ పొట్నూరు-శృంగవరపుకోట (తెదేపా)
