Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » కత్తితో బెదిరించి విమానం హైజాక్‌కు యత్నం..
క్రైం

కత్తితో బెదిరించి విమానం హైజాక్‌కు యత్నం..

apanalysisBy apanalysisApril 19, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అమెరికాలోని బెలిజ్‌ (Belize)లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు హైజాక్‌ (Hijack) చేసేందుకు ప్రయత్నించాడు.
అమెరికాలోని బెలిజ్‌ (Belize)లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు హైజాక్‌ (Hijack) చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, తోటి ప్రయాణికుడు కాల్పులు జరపడంతో నిందితుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
న్యూయార్క్‌ పోస్ట్‌ నివేదిక ప్రకారం.. ట్రాపిక్‌ ఎయిర్‌ (Tropic Air plane)కు చెందిన ఓ చిన్న విమానం గురువారం కొరొజాల్‌ నుంచి శాన్‌ పెడ్రోకు వెళ్తోంది. విమానం కొరొజాల్‌ ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్‌ తీసుకుంది. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికి అందులోని ఓ ప్రయాణికుడు కత్తితో ప్రయాణికులకు బెదిరించాడు. విమానం హైజాక్‌ చేసేందుకు ప్రయత్నించాడు. కొందరు ప్రయాణికుల్ని గాయపరిచాడు కూడా. అతడి చర్యకు ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇంతలో ఓ ప్రయాణికుడు తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పు్ల్లో నిందితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాద సమయంలో విమానంలో 14 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ నివేదించింది. నిందితుడిని అమెరికా పౌరుడు 49 ఏళ్ల అకిన్యేలా సావా టేలర్‌గా గుర్తించారు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బెలిజ్‌ పోలీసు కమిషనర్‌ చెస్టర్‌ విలియమ్స్‌ తెలిపారు. అతడు విమానంలోకి కత్తిని ఎలా తీసుకురాగలిగాడన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Post Views: 111
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

వెబ్ సిరీస్‌ చూసి.. బాలుడి ఆత్మహత్య

August 9, 2025

నగరంలో దొంగనోట్ల కలకలం

August 8, 2025

ఎస్‌బీఐ బ్యాంకులో భారీ దోపిడీ

July 29, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.