Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » కార్యసాధనకు ఓపిక, సహనం అవసరం.
ఆంధ్రప్రదేశ్

కార్యసాధనకు ఓపిక, సహనం అవసరం.

apanalysisBy apanalysisOctober 27, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

అవసరమైతే కొన్నిసార్లు సర్దుకుపోవాలి.
కాపు సామాజికవర్గం అన్ని రంగాల్లో ముందుండాలి.
విద్యార్ధుల ఉపకార వేతనలకు రాయల్ సర్వీస్ ట్రస్ట్ కి రూ. లక్ష్ల విరాళం
బండి రామకృష్ణ.

మానికొండ గణేశ్, జర్నలిస్టు
‘‘ మూడు రూపాయల కూలి నుంచి నా జీవితాన్ని ప్రారంభించా. ఇప్పుడు నా వద్ద 350 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. రూ.12 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు జీతం తీసుకుంటున్న ఉద్యోగులు నా సంస్ధల్లో పని చేస్తున్నారు. నేను చదువుకోక పోయినా, విద్యాసంస్ధలు నడుపుతున్నాను. చిన్నపాటి మెస్ తో వ్యాపారం ప్రారంభించాను. మచిలీపట్నంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పుడు హోటళ్లు నిర్వహిస్తున్నాను. విజయవాడలోనూ ప్రారంభించనున్నాను. పొదుపు మంత్రంతో చిన్నపాటి మొత్తాలను బ్యాంకుల్లో ఫిక్సెడ్ డిపాజిట్ చేశాను. ఆర్ధిక క్రమశిక్షణ పాటించే వ్యక్తిగా బ్యాంకర్ల వద్ద గుర్తింపు పొందాను. వారి నుంచి రుణాలు తీసుకుని వ్యపారాన్ని విస్తరించాను. సాధ్యం కానిది అంటూ ఏదీ ఉండదు. అవతలి వ్యక్తి సాధించగా లేనిది మనం ఎందుకు సాధించలేము. ఒక రోజు ఆలస్యం అవుతుంది అంతే’. పట్టుదలతో పని చేసి విజయం సాధించాలి’’ – స్పూర్తినిచ్చే ఈ బంగారు పలుకులు ఎవరివో కావు. ఆర్ కె. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత, జనసేన నేత, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణవి. ఆదివారం సాయంత్రం వెస్టిన్ కాలేజి ఆఫ్ బిజినెస్ మేనేజిమెంట్ ఆవరణలో రాయల్ క్లబ్ నెలవారీ సమావేశాలకు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.
కాపు సామాజిక వర్గం ముందు ఆర్ధికంగా బలపడాలి. ఆ తరువాత ఇతర రంగాలవైపు దృష్టిని సారించాలన్నారు. జనసేన పార్టీలో క్రియాశీలకంగా పని చేసి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ వద్ద గుర్తింపు పొందాను. డీసీఎంఎస్ చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్నాను. జన బలం కలిగిన మనం ఐక్యంగా ఉండాలి. ప్రభుత్వం వద్ద మన అభివృద్ధికి అవసరమైన పనులు చేయించుకోవాలన్నారు. మన సామాజికవర్గం అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉండటానికి అంతా ప్రయత్నం చేయాలి. ఇతర సామాజికవర్గాల పట్ల వ్యతిరేకత పెంచుకోవద్దు. వారిలోని మంచినీ తీసుకోవాలని సూచించారు..
ఏపనినైనా సాధించడానికి ఓపిక, సహనం అవసరమన్నారు. కార్యసాధన కోసం కొన్నిసార్లు అవతలి వారిది కరెక్టు కాకపోయినా తగ్గి ఉండాలి. సర్దుకుపోవాలి.అలా చేయడంలో ఎంతో ఆనందం ఉంటుంది.ఒకసారి ప్రయత్నం చేయండని సూచించారు. కాపు సామాజికవర్గం అభ్యున్నతికి రాయల్ క్లబ్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. పేద విద్యార్ధులకు ప్రతీ సంవత్సరం ఉపకార వేతనాలను ఇస్తుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తన వంతుగా రూ.లక్ష్లను ప్రకటించారు. ఈ మొత్తం ప్రతీ ఏడాది ఇస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రాయల్ క్లబ్ సభ్యులు బండి బండి రామకృష్ణను ఉచిత రీతిన సత్కరించారు. సమావేశంలో రాయల్ క్లబ్ ప్రెసిడెంట్ ఇమడాబత్తుల నరహరి, కార్యదర్శి తోట వెంకట రవీంద్ర, కోశాధికారి దారపురెడ్డి అజాద్ బాబు, వ్యవస్ధాపకులు పేటేటి పుల్లయ్య ఇతర పాలకవర్గ సభ్యులు ప్రసంగించారు.
—-

Post Views: 253
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

గోదాదేవి కళ్యాణం

January 14, 2026

రాయల్ సర్వీస్ ట్రస్ట్

January 5, 2026

మన్నవ

December 30, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.