Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » కూల్ న్యూస్.
ఆంధ్రప్రదేశ్

కూల్ న్యూస్.

apanalysisBy apanalysisMay 24, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఏపీ స్టేట్ బ్యూరో,

వాతావరణ శాఖ సూపర్ కూల్ న్యూస్ చెప్పింది. దేశంలో అత్యధికంగా వర్షపాతాన్ని ఇచ్చే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని, సహజంగా మరో ఎనిమిది రోజుల తర్వాత కేరళ తీరాన్ని తాకాల్సిన ఋతుపవనాలు, ముందస్తుగానే కేరళ తీరాన్ని తాకాయి అని పేర్కొంది. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి విస్తరించే అవకాశం ఉందని, ఈసారి తెలుగు రాష్ట్రాలలో ముందస్తుగానే వర్షాకాలం ప్రారంభం అవుతుందని పేర్కొంది.

ముందస్తుగా పలకరించిన రుతుపవనాలు, ఏపీలో అప్పటినుండే వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి మరో రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటి ప్రభావంతో జూన్ రెండో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా జూన్ ఒకటవ తేదీకి రుతుపవనాలు పలకరిస్తాయి. ఈసారి మాత్రం మే నెలలోనే ముందస్తుగా పలకరిస్తున్నాయి.

గత 16ఏళ్ళలో ఇప్పుడే ముందస్తు రుతుపవనాల పలకరింపు గత 16 ఏళ్లలో ముందస్తుగా ఋతుపవనాలు పలకరించడం ఇదే మొదటిసారి. 2009లో మే 23వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఇక పోయిన సంవత్సరం మే 31 తేదీన అంతకు ముందు 20లో జూన్ 1న 2021లో జూన్ 3న 2022లో మే 29న 2023 లో వారం రోజులు ఆలస్యంగా జూన్ 8వ తేదీన ఋతుపవనాలు కేరళకు వచ్చాయి. అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఈసారి ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో ఈసారి అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.

ఇదిలా ఉంటే భారతదేశంలో 52% నికర సాగు భూమి వర్షాధారంగా నే ఉంది. ఈ క్రమంలో నైరుతి రుతుపవనాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు సక్రమంగా వస్తేనే, వర్షాలు కురిస్తేనే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుంది. నైరుతి రుతుపవనాల ఆగమనం తీపి కబురు దేశంలో వర్షాధారంగా సాగుతున్న భూమి నుంచి 40 శాతం దిగుబడి వస్తుంది. ఇక మన వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వడానికే కాకుండా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి తదితర అవసరాలకు కూడా వర్షపాతమే ఆధారం. కనుక నైరుతి రుతుపవనాల ఆగమనం దేశానికి తీపి కబురు.

—-

Post Views: 40
early mansoon good news to public heavy rains no summer
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

గోదాదేవి కళ్యాణం

January 14, 2026

రాయల్ సర్వీస్ ట్రస్ట్

January 5, 2026

మన్నవ

December 30, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.