ఏపీ స్టేట్ బ్యూరో,
మొక్కలు నాటే కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కోరారు. మంగళగిరి రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ప్రతీ నెల 3 వ శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర. కార్యక్రమం కొనసాగుతుందని, పరిశుభ్రత – పచ్చదనం థీమ్ గా దీనిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పర్యావరణానికి, పచ్చదనానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని, 30 శాతం గ్రీన్ కవర్ తో పచ్చదనానికి పెద్దపీట వేస్తూ, అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. గ్రీన్ కవర్ లో ప్రపంచ దేశాలతో మనం పోటీపడాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో ఐజీపీ హరికృష్ణ, రవి ప్రకాష్, జి.పాలరాజు, రాజకుమారి, డిఐజిలు అమ్మిరెడ్డి, సెంథిల్ కుమార్, పకీరప్ప, ఎస్పీలు శ్రీకాంత్, బి. ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
