Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » చినాబ్ బ్రిడ్జ్ నిర్మాణంలో మాధవీలత
అంతర్జాతీయం

చినాబ్ బ్రిడ్జ్ నిర్మాణంలో మాధవీలత

apanalysisBy apanalysisJune 9, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఒంగోలు : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ బ్రిడ్జ్ నిర్మాణంలో తెలుగు మహిళ గాలి మాధవీలత రెడ్డి కీలక పాత్ర పోషించారు. 17 సంవత్సరాల పాటు నిరంతరంగా కన్సల్టెంట్‌గా సేవలందించిన మాధవీ, ఈ ప్రాజెక్ట్ విజయవంతానికి ముఖ్యమైన శాస్త్రీయ పునాది వేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఐఐఎస్‌సీ బెంగళూరు లో Geotechnical Engineering ప్రొఫెసర్‌గా పనిచేస్తూ, Rock Mechanics రంగంలో ఆమె పరిశోధనలు ఈ వంతెన నిర్మాణంలో కీలకంగా నిలిచాయి.

ఈ చినాబ్ వంతెన భారతదేశంలోనే కాక, ప్రపంచంలో కూడా అద్భుత ఇంజినీరింగ్ చరిత్రగా నిలిచింది. ఇది ఐఫిల్ టవర్ కంటే ఎత్తు కలిగిన వంతెనగా గుర్తింపు పొందింది. జమ్మూ-శ్రీనగర్ మధ్య భద్రతా అవసరాల కోసం నిర్మించిన ఈ వంతెనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ మైలురాయి వెనుక మాధవీలత బృందం కృషి ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు.

మాధవీలత రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందినవారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, చదువులోనూ, పరిశోధనల్లోనూ ప్రత్యేకంగా రాణించారు. తల్లిదండ్రులు అన్నపూర్ణమ్మ, వెంకటరెడ్డి. భర్త హరిప్రసాద్ రెడ్డి బాపట్ల జిల్లా మైదుకూరు వాసి. చిన్ననాటి నుంచే డాక్టర్ కావాలని కలలు కన్న మాధవీ, అనంతర పరిస్థితుల నేపథ్యంలో బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్) చేసారు. అక్కడినుంచి పరిశోధనల పట్ల ఆసక్తి పెరిగి ఐఐటీ మద్రాస్ లో పీహెచ్.డి పూర్తిచేశారు.

తరువాత ఐఐటీ గౌహతి లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన మాధవీ, 2003లో ఐఐఎస్‌సీ బెంగళూరు లో చేరారు. అక్కడే ఆమె చినాబ్ బ్రిడ్జి ప్రాజెక్ట్ లోకి ప్రవేశించారు. రాక్ మెకానిక్స్‌పై ఆమెకు ఉన్న లోతైన విజ్ఞానం ప్రాజెక్ట్ కి కీలకంగా మారింది. శిలల స్థితి, బరువు, కదలికలపై ఆమె చేసిన అధ్యయనమే వంతెన నిర్మాణానికి శాస్త్రీయ పునాది.

Post Views: 118
17 years experience in bridge work chinab bridge praminent role in bridge construction
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

ట్రంప్ సుంకాలు

August 8, 2025

వైసీపీ కి మంత్రి సారధి హెచ్చరిక

June 15, 2025

పాకిస్తాన్

June 8, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.