దశాబ్దాలు గడిచినా ప్రజల గుండెల్లో దేవినేని రమణ
తన నిరుపమాన సేవలతో రమణ ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం ఏర్పరుచుకున్నారు
తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ
స్వర్గీయ దేవినేని వెంకట రమణ 26వ వర్ధంతి ని పురస్కరించుకుని గొల్లపూడిలోని కార్యాలయంలో ఆయన చిత్రపటానికి టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 26 సంవత్సరాలు గడిచినా ఆయన పట్ల ప్రజల ఆదరణలో ప్రేమ ఆప్యాయతలలో ఎటువంటి మార్పు లేదని ఆయన స్ఫూర్తిగా నాయకులు, కార్యకర్తలు కలిసి ముందుకు సాగుతున్నామని అన్నారు. శ్రమదానంతో వేములపల్లి గ్రామంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రారంభించి ముందుకు తీసుకువెళ్లారనీ, వెలదికొత్తపాలెంలో జన్మభూమి కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడుని నందిగామ ప్రాంతానికి తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నో చేపట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రమణ జ్ఞాపకాలను, ఆయన చేసిన సేవలను ఎప్పటికీ మరువలేమని, నియోజకవర్గంలోనూ జిల్లాలోనూ రమణ చేసిన సేవలు అపూర్వమైనవని అన్నారు. రాజకీయ వినీలాకాశంలో ఒక తారాజువ్వలా వెలుగొందిన రమణ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
