.
లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తాం
షర్మిలా హెచ్చరిక
ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫై ఉన్న కోపాన్ని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద చూపిస్తుందని ఏపీ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ వైఎస్ షర్మిల విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప సేవలు చేశారని, పార్టీల రహితంగా ఆయన్ను అందరూ అభిమానించారని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం ఇందుకు విరుద్దంగా నిర్ణయాలు తీసుకుంటుందని శుక్రవారం మీడియాకు వివరించారు. వైఎస్ ఆర్ విగ్రహాల మీద ఆ కోపాన్ని చూపిస్తుందని చెప్పారు. నందిగామ గాంధీ సెంటర్ లో మహానేత విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమైన చర్యగా ఆమె పేర్కొన్నారు. ఈ చర్యను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇది కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మహానేత మరణం తర్వాత గాంధీ సెంటర్ వద్ద నాటి ప్రభుత్వం అక్కడ వైఎస్ ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఆ విగ్రహం చుట్టూ వైసీపీ అక్రమంగా వేసుకున్న సెట్టింగులు తొలగించుకోండి. మాకేం అభ్యంతరం లేదని తెలిపారు. కానీ ఇదే సాకుగా చూపి విగ్రహాల మీద చేయి వేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తొలగించిన చోట వెంటనే రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం తప్పదని ఆమె హెచ్చరించారు.
Post Views: 92