వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్షా ఫలితాల్లో టాప్-100లో రాష్ట్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించడం పట్ల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. 19వ ర్యాంకు సాధించిన డి.కార్తీక్ రామ్ కిరీటి, 56వ ర్యాంకు సాధించిన కె.మోహిత శ్రీరామ్, 59వ ర్యాంకు సాధించిన డి.సూర్యచరణ్, 64వ ర్యాంకు సాధించిన పి.అవినాష్, 70వ ర్యాంకు సాధించిన వై.సమీర్ కుమార్, 92వ ర్యాంకు సాధించిన టి.శివమణిదీప్ లకు హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలిపారు. దేశస్థాయిలో నిర్వహించిన పోటీపరీక్షలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు రాణించడం సంతోషంగా ఉందన్నారు.. విద్యార్థులు తమ ప్రతిభతో జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి గర్వకారణంగా నిలిచారన్నారు.. వైద్య వృత్తి ద్వారా భవిష్యత్ లో ప్రజలకు సేవలందించాలని ఆయన కోరా
