నేను మారను, నా వ్యక్తిత్వం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. నువ్వే పదవి వచ్చాక మారిపోయావని రాజ్య సభ మాజీ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నారు. మూడు దశాబ్దాలుగా రాజశేఖర్ రెడ్డి కుటుంబం తో అనుబంధం ఉంది. పెళ్ళి చేసుకున్న వారే విడిపోతున్నారు, మాది రాజకీయ బంధం, ఇందులో ఆశ్చర్యం ఏముంది? ప్రలోభాలకు లొంగను, ఎవ్వరికీ భయపడను, విశ్వసనీయత కోల్పోయే తత్వం కాదు. మద్యం కేసు సిట్ చూస్తోంది. కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. భవిష్యత్ లో ఇంకా వివరాలు చెప్పాల్సి వస్తే చెబుతానేమో!భక్తి ఇప్పుడూ ఉంది అప్పుడూ ఉంది. కాకపోతే గతంలో మా నాయకుడి మీద ఉండేది. ఇప్పుడు దేవుడి మీద మాత్రమే ఉంది. ఆయనకు ఇంకా నాగురించి ఏమి తెలియదు. నేను ఎవ్వరి ప్రలోభాలకు లొంగే రకం కాదు.ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఎన్నో బాధలు పడ్డాను. అయినా అక్కడ ఉంటే నా బాధలు తగ్గవని అర్ధమైంది. అందులోంచి తప్పుకున్నాను. ప్రశాంతంగా హాయిగా వున్నానని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పై ఆయన స్పందన ఇది
