Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » పంట నష్టానికి తక్షణమే పెట్టుబడి సాయం
ఆంధ్రప్రదేశ్

పంట నష్టానికి తక్షణమే పెట్టుబడి సాయం

apanalysisBy apanalysisMay 6, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అకాల వర్షాల కారణంగా పంటల నష్టాన్ని వెంటనే అంచనా వేసి, నష్టపోయిన రైతులకు మంగళవారం సాయంత్రంలోగా పెట్టుబడి సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పిడుగుపాటు కారణంగా చనిపోయిన 10 మంది కుటుంబాలకు తక్షణమే పరిహారం ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, పంటనష్టంపై సోమవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పిడుగుపాటుకు చనిపోయిన పశువులకు నిబంధనలకు అనుగుణంగా సాయం విడుదల చేయాలని చెప్పారు. అకాల వర్షాలతో 2,224 హెక్టార్లలో వరి, మొక్కజొన్న దెబ్బతిన్నాయని, 138 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మామిడి తదితర ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు సీఎంకు నివేదిక ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో 1,033 హెక్టార్లు, నంద్యాలలో 641, కాకినాడలో 530, శ్రీసత్యసాయి జిల్లాలో 20 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. కృష్ణా, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్, తిరుపతి, నంద్యాల, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వివరించారు
కేంద్రంతో మాట్లాడి రైతుల దగ్గర అదనంగా ఉన్న పంటను కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు వివరించారు. తమ ధాన్యం కొనలేదనే మాట.. ఏ ఒక్క రైతు నుంచి కూడా రాకూడదని చెప్పారు. రబీలో 20 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటికి 13 లక్షల టన్నులు సేకరించామని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సౌరభ్‌ గౌర్‌ సీఎంకు తెలిపారు. వర్షాలకు రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

పలు జిల్లాలకు వర్ష సూచన ఉందని.. కలెక్టర్లు, అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, విపత్తుల వేళ అధికారులు మానవత్వంతో పనిచేయాలని సూచించారు. పిడుగులు పడే సమయాల్లో సెల్‌ఫోన్లకు సందేశం వెళ్లకపోతే, దగ్గరలోని సచివాలయ సిబ్బందిని అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు. కిందిస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ‘విపత్తుల సమయంలో ముందస్తు సన్నద్ధత అవసరం. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద మంచి సాంకేతికత అందుబాటులో ఉంది. ఆర్టీజీఎస్‌లోని అవేర్‌ విభాగం నుంచి కూడా వాతావరణ హెచ్చరికలు ఇస్తుంటాం. యంత్రాంగం అప్రమత్తంగా ఉంటే నష్టనివారణ చేయగలం. ప్రతి మండలంలోని అధికారులను కలెక్టర్లు సన్నద్ధం చేయాలి’ అని ఆదేశించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న విద్యుత్‌ వ్యవస్థను వెంటనే పునరుద్ధరించడంలో కృషి చేసిన అధికారులు, సిబ్బందిని సీఎం అభినందించారు.

Post Views: 34
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

గోదాదేవి కళ్యాణం

January 14, 2026

రాయల్ సర్వీస్ ట్రస్ట్

January 5, 2026

మన్నవ

December 30, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.