Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » పది నిముషాల్లో డాక్యుమెంట్
ఆంధ్రప్రదేశ్

పది నిముషాల్లో డాక్యుమెంట్

apanalysisBy apanalysisJuly 28, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


రిజిస్ట్రేషన్ శాఖలో విప్లవాత్మక మార్పులు
కొనుగోలుదారులకు వాట్పాప్ లో ఒరిజినల్ డాక్యుమెంట్
పారదర్శంగా రిజిస్ట్రేషన్లు
ఏపీలో పలు ప్రాంతాల్లో అమలులోకి వచ్చిన కొత్త విధానం

ఎం.గణేశ్..ఏపీ ఎనాలిసిస్
రిజిస్ట్రేషన్ శాఖలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకదాని తరువాత మరొక నూతన విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తీసుకువస్తుంది. కొనుగోలుదారులు, అమ్మకందారులకు ఎటువంటి ఇబ్బంది కలిగించని రీతిలో పనులు వేగంగా జరిగిపోతున్నాయి. నాలుగు రోజుల నుంచి ఏపీలోని పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కొనుగోలుదారులకు పది నిముషాల్లోనే ఒరిజినల్ డాక్యుమెంట్లను అధికారులు ఇచ్చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తరువాత నాలుగైదు రోజుల తరువాతనే కొనుగోలుదారులకు డాక్యుమెంట్లను ఇచ్చే విధానం నిన్న మొన్నటి వరకు కొనసాగింది. ఇందులోను కొనుగోలుదారుల నుంచి కమిషన్లు వచ్చిన తరువాతనే రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వాటిని ఇచ్చేవారు. ఇప్పుడలా లేదు. పరిస్ధితులు అనూహ్యంగా మారిపోయాయి. రిజిస్ట్రేషన్ పై కొనుగోలుదారులకు ఏ మాత్రం అవగాహన ఉన్నా, ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా మొత్తం చెల్లించి ఒరిజినల్ డాక్యుమెంట్లు పొందే అవకాశాలు ఏర్పడ్డాయి. ఇలానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్టు సమాచారం అందుతోంది.
వివరాల్లోకి వెళితే…
విశాఖపట్నం, విజయవాడలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రేషన్ సమయంలో కొనుగోలుదారు మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్‌తో సరిపోల్చిన తర్వాత, డాక్యుమెంట్ వాట్సాప్‌కు పంపబడుతుంది. ఈ విధానం పారదర్శకతను పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు. అసలు డాక్యుమెంట్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బయోమెట్రిక్ ద్వారా పొందవచ్చు.
అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటుంది. దీనిలో భాగంగానే రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్.. వాట్సాప్ ద్వారానే బర్త్, డెత్ సర్టిఫికెట్లు అందించే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఏపీలో వాట్సాప్ ద్వారానే సుమారు 300 సేవలు ప్రజలకు అందుతున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖ .. ఇప్పుడు వాట్సాప్‌లో సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా ఇకపై ఏదైనా ఆస్తిని రిజిస్టర్‌ చేసినప్పుడు అందుకు సంబంధించిన ఒరిజనల్ డాక్యుమెంట్ నేరుగా కొనుగోలుదారుడి మొబైల్ వాట్సాప్ నంబరుకు పంపిచేలా ఏర్పాటు చేశారు.
రిజిస్ట్రేషన్ల శాఖ తాజా నిర్ణయం ప్రక్రయ ఇకపై ఏదైనా ఆస్తిని రిజిస్టర్ చేస్తే.. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఒరిజనల్‌ డాక్యుమెంట్‌ కాపీని.. కొనుగోలుదారుడి వాట్సాప్ నంబరుకి పంపేలా ఏర్పాటు చేశారు. ఈ సర్వీసు నాలుగు రోజుల నుంచి విశాఖపట్నం, విజయవాడల్లో అందుబాటులోకి వచ్చింది.

Post Views: 28
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

గోదాదేవి కళ్యాణం

January 14, 2026

రాయల్ సర్వీస్ ట్రస్ట్

January 5, 2026

మన్నవ

December 30, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.