ఇదీ సంగతి.
ఏపీ స్టేట్ బ్యూరో,
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల విడుదలైన టెన్త్ పరీక్షా ఫలితాల్లో బాపట్ల జిల్లా కొల్లూరు హైస్కూల్‌కు చెందిన తేజస్వినికి 5 సబ్జెక్టుల్లో 90కి పైగా మార్కులు రాగా సాంఘిక శాస్త్రంలో 23 మార్కులే రావడంతో ఫెయిల్ అయ్యారు.
వెంటనే రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోగా ఆమెకు సోషల్ స్టడీస్‌లోనూ 96 మార్కులు వచ్చాయి.
వైఎస్సార్ కడప జిల్లా ఎరగ్రుంట్లకు చెందిన గంగిరెడ్డి మోక్షితకు కూడా సోషల్ స్టడీస్‌లో 21 మార్కులే వచ్చాయి. దీనిపై ఆమె రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే 84 మార్కులు వచ్చాయి.
దీంతో ఇందుకు బాధ్యులైన ఓ చీఫ్ ఎగ్జామినర్ సహా ఐదుగురు ఉపాధ్యాయులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ప్రశ్నపత్రాల మూల్యాంకన చరిత్రలో ఉపాధ్యాయులు సస్పెండ్ కావడం ఇదే తొలిసారని డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (ఎస్‌ఎస్‌సి బోర్డు) అధికారులు చెబుతున్నారు.
