Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » పాకిస్థానీయుల యూట్యూబ్‌ ఛానళ్లపై నిషేధం
అంతర్జాతీయం

పాకిస్థానీయుల యూట్యూబ్‌ ఛానళ్లపై నిషేధం

apanalysisBy apanalysisApril 28, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్‌ ఛానళ్ల (Ban on Youtube Channels) ప్రసారాలను భారత్‌లో నిషేధించింది. పాక్‌ న్యూస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై ఈ వేటు వేసింది. డాన్‌ న్యూస్‌, జియో న్యూస్‌, సామా టీవీ సహా పలు మీడియా ఛానళ్లు, కొంతమంది జర్నలిస్టుల ఖాతాలపై ఈ నిషేధం విధించింది. మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ఛానల్‌లో కూడా ప్రసారాలు అందుబాటులో లేవు.

యూట్యూబ్‌లో ఈ ఛానళ్లను తెరవగానే.. ‘‘ఇందులోని కంటెంట్‌ అందుబాటులో లేదు. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అనే సందేశం వస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్‌ (Pakistan) ప్రభుత్వానికి చెందిన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాను భారత్‌లో నిలిపివేసిన సంగతి తెలిసిందే. భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్‌, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ యూట్యూబ్‌ ఛానళ్లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

జమ్మూకశ్మీర్‌లో విస్తృత సోదాలు..
మరోవైపు పహల్గాం దాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ పోలీసులు స్థానికంగా ఉన్న ఉగ్ర నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే పలువురు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన భద్రతా సిబ్బంది.. తాజాగా విస్తృత స్థాయిలో సోదాలు చేపట్టారు. దోడాలోని పలు నివాసాల్లో పెద్దఎత్తున తనిఖీలు చేస్తున్నారు.

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam terror attack)లో ఏప్రిల్‌ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని వీడేవరకూ ఆ దేశంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన భారత్‌.. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్‌ జాతీయులను దేశం నుంచి వెళ్లగొట్టింది.

Post Views: 29
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

ట్రంప్ సుంకాలు

August 8, 2025

వైసీపీ కి మంత్రి సారధి హెచ్చరిక

June 15, 2025

చినాబ్ బ్రిడ్జ్ నిర్మాణంలో మాధవీలత

June 9, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.