దీపారాధన, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు
అధిక సంఖ్యలో హాజరైన భక్తులు
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ.
కార్తీక పౌర్ణమి సందర్భంగా పున్నమి తోట టిటిది దేవస్థానంలో భక్తుల అధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. భక్తులు శాంతిశ్రీ, తులసి, రాజేశ్వరి, మణి., సుశీలల ఆధ్వర్యంలో దేవాలయం లోని ఉసిరి చెట్టు క్రింద అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అవునేతితో ఉన్న 365 వత్తులను భక్తులకు పంపిణీ చేయగా, వారు ఉసిరి చెట్టు క్రింద వత్తులను వెలిగించారు. ఆలయ ఇనస్పెక్టర్ లలితా, రమాదేవి సూపరింటెండెంట్ మల్లిఖార్జునరావు, న్యాయవాదులు పధనల ఏడుకొండలు, విజయకుమార్, ప్రసాద్ భక్తులు వేణు, ప్రసాదరెడ్డి, జలయా అర్చకులు మురళీకృష్ణ లు కార్యక్రమ నిర్వహణా బాధ్యతలు చేపట్టారు
