Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » పోలీసుల అదుపులో చెవిరెడ్డి
ఆంధ్రప్రదేశ్

పోలీసుల అదుపులో చెవిరెడ్డి

apanalysisBy apanalysisJune 17, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

మద్యం ముడుపులతో లింక్

ఏపీ ఎనాలిసిస్, విజయవాడ

వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని బెంగళూరు ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూర్ నుంచి కొలంబో వెళ్తుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన బెంగళూరు నుంచి కొలంబో వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఏపీ లిక్కర్ స్కాంలో ఆయనపై లుక్‌అవుట్ నోటీసులు ఉండటంతో ఎయిర్‌పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయంపై ఏపీ పోలీసులకు కెంపెగౌడ విమానాశ్రయ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో తిరుపతి నుంచి ఏపీ సిట్ అధికారులు బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో చెవిరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకోనున్నారు.

బెంగుళూరు నుంచి ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయానికి చెవిరెడ్డిని విజయవాడకు తీసుకురానున్నారు అధికారులు. మద్యం కుంభకోణంలో రేపు ఉదయం చెవిరెడ్డి‌ అరెస్ట్‌ను చూపనున్నారు సిట్ అధికారులు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీ, తెలంగాణ సరిహద్దులో జగ్గయ్య పేట సమీపంలోని ఓ టోల్‌గేట్ వద్ద 8 కోట్ల 20 లక్షల రూపాయలు కారులో తీసుకువస్తూ చెవిరెడ్డి పీఏ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అప్పట్లోనే ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసింది. మద్యం ముడుపులను హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు తరలించడంలో చెవిరెడ్డి మనుషులు కీలక పాత్ర పోషించారని సిట్‌కు సమాచారం అందింది.

ఈ నేపథ్యంలో చెవిరెడ్డి గన్‌మెన్‌లను, వ్యక్తిగత సిబ్బంది దగ్గర ఇప్పటికే స్టేట్‌మెంట్‌లు రికార్డు చేశారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా.. చెవిరెడ్డి గన్ మెన్ ఒకరు ఈ రోజు హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. తమతో బలవంతంగా స్టేట్‌మెంట్ రాయించారని, అలాగే చెవిరెడ్డి పాత్ర ఉన్నట్లు చెప్పమన్నారని పోలీసులపై ఫిర్యాదు చేశారు. అయితే ఈరోజు చెవిరెడ్డి కొలొంబో వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే చెవిరెడ్డిపై వారం క్రితమే లుక్‌ఔట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ క్రమంలో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కొలంబో వెళ్తున్నారని సిట్ అధికారులు చెబుతున్నారు. కొలంబో వెళ్తుండగా బెంగుళూరు ఎయిర్పోర్ట్ సిబ్బంది అడ్డుకున్నారు. రేపు సాయంత్రం విజయవాడ కోర్ట్‌లో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని హాజరుపరిచే అవకాశం ఉంది. కాగా.. మద్యం ముడుపులతో లింక్ ఉండటంతో చెవిరెడ్డిని మద్యం కేసులో నిందితుడిగా చేర్చింది సిట్.


అయితే మద్యం కుంభకోణం కేసులో డిస్ట్లరీల నుంచి కలెక్షన్ వసూలు చేసిన కేసిరెడ్డి రాజశేఖరెడ్డి, అతని గ్యంగ్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉందంటూ మాజీ సీఎం జగన్ సెక్రటరీగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ గోవిందప్పలను సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు తొలిసారిగా మద్యం కేసులో ఓ రాజకీయ నాయకుడిని, జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధుపులోకి తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Post Views: 43
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు

April 1, 2026

నియోజకవర్గాల పునర్విభజనతో మరిన్ని అవకాశాలు: పవన్‌ కల్యాణ్‌

March 24, 2026

రాష్ట్రంలో పెద్దఎత్తున తాగునీటి ప్రాజెక్టుల పనులు

March 23, 2026
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.