Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » ప్రజాస్వామ్య పరిరక్షకుడు నారా చంద్రబాబు నాయుడు….వెయ్యేళ్ళు వర్ధిల్లాలి…
రాజకీయాలు

ప్రజాస్వామ్య పరిరక్షకుడు నారా చంద్రబాబు నాయుడు….వెయ్యేళ్ళు వర్ధిల్లాలి…

apanalysisBy apanalysisApril 20, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఏపీ ఎనాలసిస్. విజయవాడ :
ప్రజాస్వామ్య పరిరక్షకుడు నారా చంద్రబాబు నాయుడు. గడిచిన 40 ఏళ్ల కాలంలో తలెత్తిన తీవ్ర సంక్షోభాలను పరిశీలిస్తే ఈ విషయం అర్ధం అవుతుంది.
అతి తీవ్రమైన నాలుగు సంక్షోభాల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలను వారికి అండగా ఉండే తెలుగుదేశం పార్టీని కాపాడిన ఘనులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .
నాలుగు సంక్షోభాల్లో మొదటిది 1984 సంక్షోభం. పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే అధికారాన్ని చేజిక్కించుకొని కాంగ్రెస్ పార్టీ యేతర ముఖ్యమంత్రిగా ప్రజల అభిమానాలను పొందిన ఎన్టీఆర్ ను ఎదుర్కోలేక నాటి ప్రధాని ఇందిరా గాంధీ అప్పటి గవర్నర్ రామ్ లాల్ ,నాదెండ్ల భాస్కరరావు లను ప్రయోగించి పార్టీలో సంక్షోభం సృష్టించిన విషయం తెలిసిందే. అ సంక్షోభం నుంచి పార్టీని కాపాడి మళ్లీ అన్న ఎన్టీఆర్ పాలనను తెలుగు ప్రజలకు అందజేసిన ఘనత నారా చంద్రబాబునాయుడు గారికి దక్కింది .ఈ ఆపరేషన్ లో వెంకయ్య నాయుడు గారు జైపాల్ రెడ్డి గారి తోట్పాటుతో చంద్రబాబు నాయుడు ఆ సంక్షోభం నుంచి పార్టీని ప్రజల్ని కాపాడగలిగారు.

ఈ పరిస్థితుల్లో పార్టీ జనరల్ సెక్రెటరీగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు నాటి నుంచి నేటి వరకు పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆ పార్టీ ద్వారా లభించిన అధికారాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే వినియోగిస్తూ వస్తున్నారు.ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చాక 1985 నుంచి కుప్పంలో పోటీ చేస్తూ ఇప్పటివరకు ఓటమి ఎరుగని నేతగా చరిత్ర సృష్టించారు.

ఆ తర్వాత 19 95లో లక్ష్మీపార్వతి వల్ల పార్టీలో సంక్షోభం తలెత్తింది. ఈ పరిస్థితులు అటు పార్టీకి ఇటు ప్రజలకు ఏమాత్రం రుచించని స్థితికి చేరాయి. ఈ పరిణామాల నుంచి పార్టీని కాపాడడానికి నాడు ఎన్టీ రామారావు గారిని యావత్తు సంతానం నాచారంలో ఉంటున్న ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఎంత చెప్పినా ఆయన
అఅవినిపించుకోలేదు. అప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడు గారే ఆ సంక్షోభాన్ని పరిష్కరించి పార్టీని గట్టెక్కించారు .

ఈ క్రమంలోనే 2014లో జరిగిన రాష్ట్ర విభజన తో అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్ ను కాపాడడానికి చంద్రబాబు నాయుడు కృషి చేశారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవడానికి తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు సీఎం చేశారు .తదుపరి 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపి రాష్ట్రాన్ని బట్టి పీడిస్తుంటే ఆ పీడ విరగడం కోసం రేయింబవళ్లు శ్రమించి ఎన్నో కష్టనష్టాలను ,అవమానాలను భరించి చివరకు జైలు జీవితాన్ని గడిపి 2024లో పార్టీని అధికారంలోకి తెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా భద్రతను కల్పించిన వీరుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు .

ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఒక బలమైన నాయకుడు చంద్రబాబు నాయుడన్న భీమాతోనే రాష్ట్ర ప్రజలు హాయిగా ఉన్నారు. ఆయన వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు…
కె వి కృష్ణారావు, సీనియర్ జర్నలిస్ట్.

Post Views: 153
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

ప్రాజెక్టు ఒకటే… పేరు మారుతూనే ఉంటుంది!

December 29, 2025

రీల్ హీరో కాదు…రియల్ హీరో.

October 30, 2025

మారిన మనిషి.

October 22, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.