Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » బాలయ్య
సినిమా

బాలయ్య

apanalysisBy apanalysisJune 10, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

శతాధిక చిత్రాల్లో నటించి స్టార్‌డమ్ సాధించిన నటసింహం నందమూరి బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు ఆయన తన 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు.

అలాంటిది తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా బాలకృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలయ్య బాబుకు ప్రత్యేకంగా ట్వీట్ చేసిన పవన్, “శతాధిక సినిమాల్లో కథానాయకుడిగా పేరు గాంచిన నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన బాలకృష్ణగారు ప్రజా జీవితంలో హిందూపురం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటున్నాను,” అని పేర్కొన్నారు.

ఇప్పటికే కళ్యాణ్ రామ్, నారా రోహిత్, బాలకృష్ణ కూతురు తేజస్విని, దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని తదితరులు బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషెస్‌తో సోషల్ మీడియా వీధులన్నీ బాలయ్య పేరిట మార్మోగిపోతున్నాయి.

ఇక పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన “Akhanda 2 Title Teaser” కూడా ప్రేక్షకుల్లో భారీగా హైప్ పెంచింది. బాలయ్య ఫ్యాన్స్ ఆ టీజర్‌ను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఓ వైపు సెలబ్రిటీల విషెస్, మరోవైపు అఖండ సీక్వెల్ టీజర్ సందడి.. బాలయ్య బర్త్ డే వేడుకలు పండుగలా మారాయి.

Post Views: 140
Balayya Birth day Dy.cm greeys Balayya Family members greets Balayya
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

ఓజీ నుంచి ప్రియాంక మోహన్‌ లుక్‌..

August 17, 2025

కూలీ’.. ‘వార్‌2’ టికెట్‌ బుకింగ్స్‌ ఓపెన్‌

August 12, 2025

ఎవరు ఎన్ని అనుకున్నా.. బొమ్మ అదిరిపోయింది

August 11, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.