సందడే…సందడి.

మత్తుక్కించిన మసులా బీచ్

వయ్యారులు ఒలకబోసిన ఉదయభాను

మధురం..మధురం..గీతామాధురి గీతాలాపనలు

పోటెత్తిన ప‌ర్యాట‌కులు

ఏపీ స్టేట్ బ్యూరో,

రెండో రోజు బందరు బీచ్ కిటకిటలాడింది. వివిధ కార్యక్రమాలను తిలకించేందుకు బందరు, పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. క్రీడలు,  సాంస్కతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. పెద్ద తిరనాళ్ల వలే జరిగిన ఈ కార్యక్రమాల పట్ల స్పందన అనూహ్యంగా లభించింది. ఫుడ్  కోర్టులు కిట‌కిట‌లాడాయి., సీ కయాకింగ్ కు మంచి ఆద‌ర‌ణ‌ లబించింది.

వాలీబాల్ పోటీల‌ను ప్ర‌జ‌లు తిలకించారు. క‌బ‌డ్డీకి ప‌ట్టం కట్టారు. అమ్యూజ్ మెంట్ కు,, ప్యారా గ్లైడింగ్, హెలీ రైడ్ కు విప‌రీత‌మైన డిమాండ్ నెలకొన్నది.సాయంత్రం కురిసిన చిరుజ‌ల్లుల‌తో ప్ర‌జ‌లు సేద తీరారు. చ‌ల్ల‌ని సాయంత్రం వేళ బీచ్ ప‌రిస‌రాలు వ‌ర్షం రాక‌తో ఆహ్లాదంగా మారాయి.


రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల రద్దీని గ‌మ‌నించి ఎక్క‌డిక‌క్క‌డ ప‌క్కాగా ఏర్పాట్లు చేసింది. గీతామాధురి పాటలు, ఉదయభాను వయ్యారాలు బీచ్ కి రెండో రోజు హైలెట్ అయ్యాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాల పట్ల ప్రజల నుంచి సానుకూలంగా స్పందన లభించింది.

విన్నమా…కన్నమా అన్నట్లుగా జరిగిన ఏర్పాట్ల వెనుక మంత్రి కొల్లు రవీంధ్ర, ఇతర అధికారుల చర్యలు జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చిపెట్టాయనడంలో అతిశయోక్తి లేదు.

—-

Post Views: 35