తెరపై సహజమైన నటనతో.. అదిరిపోయే స్టెప్పులతో కుర్రకారుని ఉర్రూతలూగించే కథానాయిక శ్రీలీల(Sreeleela).. బాలీవుడ్‌లో కార్తిక్ ఆర్యన్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడామె మరో హిందీ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్లు సమాచారం. విక్రాంత్ మాస్సే, లక్ష్య ప్రధాన పాత్రల్లో ‘దోస్తానా 2’ (Dostana 2) రూపొందుతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కరణ్ జోహార్ (Karan Johar) నిర్మాత. ఇప్పుడీ చిత్రంలో కథానాయికగా శ్రీలీలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీని గురించి ఆమెతో చర్చలు చేస్తున్నారని.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం శ్రీలీల జాబితాలో ‘మాస్ జాతర’, ‘పరాశక్తి’ తదితర చిత్రాలు ఉన్నాయి.
