విలీనమైన నాలుగు గ్రామీణ బ్యాంకులు
ఒక రాష్ట్రం-ఒక గ్రామీణ బ్యాంకు విధానం
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఒక రాష్ట్రం – ఒక గ్రామీణ బ్యాంక్” విధానానికి అనుగుణంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు లు విలీనం అయ్యాయి. దీనికి సంబంధించి భారత ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల విభాగం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది మే 1 నుంచి అమలులోకి రానున్నది. విలీనం తరువాత “ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్” అనే పేరుతో, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా* స్పాన్సర్‌షిప్‌లో కార్యకలాపాలు కొనసాగుతాయి.
ఈ మార్పును ఖాతాదారులు, ప్రజలు పరిగణనలోకి తీసుకోవాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. యధావిధిగానే అన్ని సేవలు కొనసాగుతాయి. ఖాతాదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి. ఖాతాదారులు తమకు అవసరమైన సమాచారం కోసం తమ సమీప శాఖను సంప్రదించవచ్చు. బ్యాంక్ అధికారుల నుండి పూర్తి సహాయం లభిస్తుంది.
