Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » రాయల్ క్లబ్
ఆంధ్రప్రదేశ్

రాయల్ క్లబ్

apanalysisBy apanalysisJuly 28, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

క్లబ్ సేవలు విస్తరించడానికి సభ్యులంతా ఐక్యంగా పని చేయాలి

కొత్త సభ్యులను చేర్పించాలి.

మేధావులు, సీనియర్ అధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాలి

రాయల్ క్లబ్ నెలవారీ సమావేశం

ఎం.గణేశ్, ఎపీ ఎనాలిసిస్

రాయల్ క్లబ్ సేవలు విస్తరించడానికి సభ్యులంతా ఐక్యంగా పని చేయాలని ఇమడాబత్తుల నరహరి కోరారు. వెస్టిన్ కాలేజిలో ఆదివారం సాయంత్రం రాయల్ క్లబ్ నెలవారీ సమావేశం జరిగింది. సభ్యులు క్లబ్ విస్తరణ, కాపు సామాజికవర్గానికి సేవలు అందించే విషయంలో పలు సూచనలు చేశారు. వీటి అమలు ద్వారా కాపు సామాజికవర్గం అభ్యున్నతికి దోహదపడాలని ప్రతినబూనారు. కొత్త సభ్యులను చేర్పించే విషయంలో అందరూ శ్రద్ద వహించాలన్నారు. సభ్యుల సంఖ్య పెరిగినప్పుడే సేవా కార్యక్రమాలను పెంచే అవకాశం ఉంటుందన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుని ప్రతీ సభ్యుడు మరుసటి నెల సమావేశంలోపు మరి కొంత మంది కొత్త సభ్యులను చేర్చించాలని కోరారు. కాపు సామాజికవర్గానికి చెందిన పేద విద్యార్ధులకు ఫీజులు, పుస్తకాలు వంటి అవసరాలను తీర్చడానికి ప్రతీ ఒక్కరూ ప్రయత్నించాలన్నారు. విద్య ద్వారానే దేనినైనా సాధించవచ్చని చెప్పారు. పేదవారిలో మెరిట్ విద్యార్ధులను ప్రోత్సహిస్తే వారు కాపు సామాజికవర్గానికే కాకుండా మొత్తం సమాజానికే ఉపయోగపడే వ్యక్తులుగా మారతారని చెప్పారు. దీనిని పరిగణనలోకి తీసుకుని కొందరు మెరిట్ విద్యార్ధులకు ఫీజులు కడుతున్నామని, వారిలో డాక్టర్లు, లెక్చరర్లు, ఐటీ ఫ్రొఫెషనల్స్ ఉన్నారని చెప్పారు. క్లబ్ కార్యదర్శి తోట వెంకట రవీంద్ర, కోశాధికారి ఆజాద్ బాబు, శీతాలం రాంబాబు, కొండిశెట్టి రాజేంద్ర, పేటేటి పుల్లయ్య, దుర్గాదేవి, వరుదు నాగరాజు తదితరులు ప్రసంగించారు.

క్లబ్ నెలవారీ సమావేశాలను ఒకే ప్రాంతంలో కాకుండా కాపు సామాజకవర్గం అధికంగా ఉన్న ప్రాంతాల్లో నిర్వహించాలని సాంబయ్య సూచించారు. దీనిపై సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పాలకవర్గం సమాధానం ఇచ్చింది. కాపు సామాజికవర్గంలోని సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతర మేధావుల సూచనలు, సలహాలు, వారి  సహకారంతో నిర్ణయాలు తీసుకుంటే మంచిదనే అభిప్రాయాన్ని సభ్యులు వ్యక్తం చేశారు. కొత్తగా చేరిన సభ్యులతో శీతాలం రాంబాబు ప్రమాణ స్వీకారం చేయించారు.

—–

Post Views: 82
Royal club monthly meeting
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

గోదాదేవి కళ్యాణం

January 14, 2026

రాయల్ సర్వీస్ ట్రస్ట్

January 5, 2026

మన్నవ

December 30, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.