ఏపీలో భారీ పెట్టుబడులు
ప్రభుత్వంతో ఒప్పందం.
M.GANESH, VIJAYAWADA.
రిలయన్స్ ఏపీలో పెట్టుబడులు పెడుతోంది. బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం ఏర్పాటు చేసుకుంది. దీని కోసం 65 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. ఒక్కో ప్లాంట్ రూ.130 కోట్ల ఖర్చుతో 500 బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నది. దీని తర్వాత కర్నూలు జిల్లాలో రూ.1,622 కోట్లతో బెవరేజెస్ యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది. ఈ ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ యూనిట్‌లో ప్యాకేజ్డ్ సాఫ్ట్ డ్రింకులు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారు చేయనున్నట్లు తెలిపింది. దీని కోసం మొదటిదశలో రూ.1,006 కోట్లు, రెండో దశలో రూ.616 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. ఆరేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని డీపీఅర్‌లో పేర్కొంది. ఈ యూనిట్ కారణంగా కర్నూలు జిల్లాలో 5000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఆఫీసు భవనాలు, వేర్ హౌసింగ్, బాట్లింగ్ లైన్ ఏరియా, ట్రీట్‌మెంట్ ప్లాంటుల కోసం 100 ఎకరాలు కేటాయించాలంటూ ప్రభుత్వాన్ని కోరింది.
| — |
