Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

apanalysisBy apanalysisJune 11, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఏపీ ఎనాలిసిస్, పొదిలి

రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రకాశం జిల్లాలోని పొదిలిలో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పొగాకు బోర్డు కార్యాల‌యంలో ఉన్న‌ రైతులను పరామర్శించారు. వారితో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. రైతులను అడిగి పొగాకు కొనుగోలు రేట్ల వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కొండపి, పర్చూరులో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. ఏ రైతు చూసినా తక్కువ ధరలకు తమ పంటలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జగన్ మండిపడ్డారు. ఇక, వరి, మిర్చి, పొగాకుతో పాటు ఏ పంట చూసినా గిట్టుబాటు ధర లేదని పేర్కొన్నారు. గత ఏడాది వైసీపీ పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చామ‌ని గుర్తు చేశారు. పంట వేసే సమయంలోనే రైతన్నలకు రైతు భరోసా అందించామ‌న్నారు. గత ఏడాదిగా రైతు భరోసా కింద ఇస్తున్న సొమ్ము ఆగిపోయింద‌న్నారు. ప్ర‌ధాని మోదీ ఇచ్చే ఆరు వేలు కాక.. మరో 20 వేలు ఇస్తామని చెప్పార‌ని, కాని జూన్ వచ్చినా ఇంత వరకు రైతులకు పెట్టుబడి సాయం అందలేదని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ ప్రభుత్వం మాత్రం రైతులను పూర్తిగా గాలికి వదిలేసిందని జగన్ ఆరోపణలు చేశారు.

జ‌గ‌న్ కు మ‌హిళ‌ల నిర‌స‌న సెగ

జగన్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీల తో టీడీపీ కార్యకర్తలు నిరసన చేశారు. పొదిలిలోని బేస్తపాలెం దగ్గర జగన్ కాన్వాయ్ మీద నల్ల బెలూన్లు, చెప్పులను గుర్తు తెలియని మహిళలు విసిరారు. దీంతో టీడీపీ, వైసీపీ మధ్య పరస్పరం దాడులు జరిగాయి. ఈ దాడిలో రాళ్లు, చెప్పులతో ఒకరిపై మరోకరు ఘర్షణకు పాల్పడ్డారు. ఈ గొడవలో పోలీస్ కానిస్టేబులకు గాయాలు అయ్యాయి.

Post Views: 34
ex cm jagan podili tour he met farmers in Tobaco board
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

గోదాదేవి కళ్యాణం

January 14, 2026

రాయల్ సర్వీస్ ట్రస్ట్

January 5, 2026

మన్నవ

December 30, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.