కొత్త పార్టీ ఏర్పాటు యోచనలో షర్మిలా రెడ్డి…
ఆగస్టు నాటికి మారనున్న ఏపీ రాజకీయ ముఖచిత్రం …
సెప్టెంబర్ లోపే లోకేష్ కు రాష్ట్ర పగ్గాలు…
కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పనున్న చంద్రబాబు ,పవన్ కళ్యాణ్…
రాష్ట్ర బిజెపి లో కీలకం కానున్న సుజనా చౌదరి…
జత కట్టనున్న కాంగ్రెస్ – వైసిపి…
రాజకీయ పార్టీని బలోపేతం చేయనున్న కృష్ణ మాదిగ.
Ap ఎనాలసిస్ – విజయవాడ : ఆగస్టు నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మారిబోతుంది .ఈ ఆకస్మిక పరిణామాలతో ఏపీలో కొంగొత్త రాజకీయ వాతావరణం కనిపిస్తుంది. దానిలో భాగంగానే రాష్ట్ర పగ్గాలు నారా లోకేష్ చేతికొచ్చే విధంగా తాజా రాజకీయ చిత్రం దర్శనమిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోపాటు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి .
ప్రస్తుతం ఏపీలో ఈ పరిణామాలు లోగుట్టుగా వున్నాయి .మరో అయిదు నెలల్లో అంటే సెప్టెంబర్ లోపు యువనేత నారా లోకేష్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలియవస్తుంది . దీనిపై ఇప్పటికే అవసరమైన కసరత్తు పూర్తయినట్టు బోగట్ట. రాష్ట్ర అవసరాలు , తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రాజకీయాలు వగైరా అంశాలను పరిగణలోకి తీసుకొని టిడిపి పెద్దలు ఈ నిర్ణయానికి వచ్చినట్టు వినికిడి .
దీనిపై కొంతమేర స్వల్ప భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మేజారిటి అభిప్రాయం పార్టీ నిర్ణయానికి సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది .అయినప్పటికీ అన్ని అంశాలపై సూక్ష్మ పరిశీలన జరుగుతున్నట్టుగా పరిస్థితులు కానవస్తున్నాయి . పార్టీలో వ్యక్తమవుతున్న స్వల్ప భిన్నాభిప్రాయాలతో పాటు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని మిళితం చేసి మార్పుకు శ్రీకారం చుట్టాలనేె
తలంపుతో సిబియన్ , జనసేనాని తమతమదైన శైలి లో వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో పార్టీకి ఎలాంటి నష్టం లేకుండా కూటమి సంకల్పానికి ఆటంకం లేకుండా లోకేష్ కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే యోచనలో వున్నారు.
ఇదే గనుక జరిగితే చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లో ఇకపై చురుగ్గా చక్రం తిప్పఘ అవకాశాలు ఉన్నాయి. ఆయన రాక కోసం ఎటూఎన్ డి ఏ ఎదురుచూస్తోంది .వచ్చే ఎన్నికల నాటికి దక్షిణాది రాష్ట్రాల్లో మరింత బలం పుచ్చుకోవాలని చూస్తున్న బిజెపి ఆ దిశగా పావులు కదుపుతుంది. దానిలో భాగంగానే సిబిఎన్ కేంద్ర రాజకీయాల్లోకి వస్తే ఆయనకు ఎన్డీఏ పగ్గాలు అప్పగించే అవకాశం లేకపోలేదు .అలాగే జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవలను ఎన్డీఏ మరింత మెరుగుపరచుకునే పరిణామాలు చోటుచేసు కుంటున్నాయి. ఆ లెక్కన ఆయనకు కేంద్రం లో ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉంది . అందుకోసం పవన్ ను రాజ్యసభకు పంపి కేంద్రమంత్రిని చేసే వ్యూహం ఎన్డీఏ మదిలో వుంది .
విజయ సాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఆస్థానానికి ప్రస్తుతం ఎన్నిక జరగనుంది . ఆ స్థానాన్ని పవన్ తో భర్తీ చేస్తే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పార్టీలైన టిడిపి జనసేన లకు న్యాయం చేసినట్టేననే అభిప్రాయంలో బిజెపి ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా చేయడం వల్ల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు ఎన్డీఏ కన్వీనర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేంద్రమంత్రి కట్టబెట్టి ఏపీలో ఆ రెండు పార్టీలకు గల ఓటు బ్యాంకును తమకు లాబించే విధంగా బిజెపి వ్యూహా రచన చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదంతా పగడ్బందీగా జరిగేందుకు బిజెపి ఏపీలో తమ పార్టీ నాయకత్వానికి పదును పెట్టనుంది .దానిలో భాగంగానే ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న పురందేశ్వరి పదవీకాలం పూర్తయ్యాక ఆ స్థానాన్ని ఓ జెంటిల్మెన్ తో భర్తీ చేయనున్నారు .అందుకోసం ఆ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి పేరు ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది .ఈ మేరకు జులై లేదా ఆగస్టులో బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా సుజనా చౌదరి పేరు ఖరారు అయ్యే అవకాశం మెండుగా ఉంది.
మరో ప్రక్క ఈ మార్పులు జరగడం వల్ల తమకు తమ పార్టీలకు నష్టం ఉండదనే అభిప్రాయంతో టీడీపీ జనసేన అధిష్టానాలతో పాటు బిజెపి ఉన్నట్టు అర్థమవుతుంది. లోకేష్ సీఎం అయితే ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ రద్దు అవుతుంది .మళ్లీ కొత్తగా క్యాబినెట్ ఏర్పాటు కావలసి ఉంటుంది. ఆ క్యాబినెట్లో జనసేన నుంచి ఇటీవల ఎమ్మెల్సీ అయిన నాగబాబు కు మంత్రి పదవి ఆటోమేటిక్ గా వస్తుంది. తద్వారా పవన్ కేంద్ర రాజకీయాల్లో ఆయన సోదరులు నాగబాబు రాష్ట్ర రాజకీయాల్లో వెలుగొందడానికి అవకాశం ఉంది. ఇదంతా అనుకున్నది అనుకున్నట్లు జరిగితే పరవాలేదు. ఒకవేళ ఏదైనా సమస్య ఎదురైతే పరిస్థితి ఏమిటనే సందిగ్ధం అంతర్గతంగా ఆయా పార్టీల్లో నెలకొని వుంది. దీనిపై జనసేన బిజెపి కంటే టిడిపిలోనే అంతర్మధనం అధికంగా ఉంది .ఈ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీలో చీలిక వచ్చే అవకాశం ఉందని ఓ వర్గం ఇప్పటికే గెస్ చేస్తుంది .
అదే నిజమైతే ఈ అవకాశాన్ని వైసిపి చేజిక్కించు కుంటుందనే అపోహలు ఆ పార్టీలో నిగూఢంగా వున్నాయి.ఇదిలావుంటే రానున్న రోజుల్లో వైసిపి ఇండియా కూటమి తో జతకట్టి కాంగ్రెస్ కు దగ్గరయ్యే పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే అంతకుమించి మరో అడుగు ముందుకేసి వైసిపిని కాంగ్రెస్ లో విలీనం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇటు వైసిపికి అటు కాంగ్రెస్ కు ఇరువురికి ఈ అవసరం అధికంగానే ఉంది. షర్మిలా , జగన్ వివాదానికి పుల్ స్టాప్ పెట్టి షర్మిల ను రాజ్యసభ సభ్యురాలుగా చేసి కేంద్రానికి పంపి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఉమ్మడి బాధ్యతలు అప్పగించే విషయంలో ఆ రెండు పార్టీల అధిష్టానాలు ఉన్నాయి .ఇందుకు షర్మిల అంగీకరించకపోతే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్ధకమైనప్పటికీ ఆ రెండు పార్టీల అవసరాలరీత్యా ఎలయన్స్ లేదా విలీనం జరగక తప్పదని రాజకీయ విశ్లేషకులంటున్నారు.
అప్పుడు షర్మిలా రెడ్డి నేత్రత్వంలో ఏపీలో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చే అవకాశం లేకపోలేదు . ఆ పార్టీ కి వైసీపీ అధినేత జగనే లక్ష్యం కాగా టిడిపికి మద్దతు పార్టీగా ఉంటుందనే అభిప్రాయము బయటకు వస్తుంది . అంతేకాకుండా ఒకవేళ కాంగ్రెస్ వైసిపి జతకట్టి రాష్ట్రంలో బలపడే పరిస్థితి ఎదురైతే ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు అవసరమైన అన్ని శక్తి యుక్తులను బయటకు తీస్తారు . అప్పుడు ఎన్డీయే కూటమిలో ఇప్పటికే ఉన్న పార్టీలతో పాటు షర్మిలా రెడ్డి పార్టీని వీటితోపాటు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు కృష్ణ మాదిగ పార్టీని తమకు మద్దతుగా మలుచుకునే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణ అంశం పూర్తి కావడంతో ఇక రాజ్యాధికారం వైపు దృష్టి కేంద్రీకరించేందుకు కృష్ణ మాదిగ సమాయత్త మవుతున్నారు. ఇకపై తమ రాజకీయ పార్టీని తెలుగు రాష్ట్రాలలో బలోపేతం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదంతా సఫలీకృతం అయ్యేందుకు ఎవరికి వారు తమ తమ వ్యూహాలు ప్రతి వ్యూహాల్లో మునిగితేలుతున్నారు.
గోడకు చెవులుంటాయి కదా అన్నట్టు ఈ లోగుట్టు వ్యవహారాలు అనోట ఈ నోట బయటకు పొక్కుతున్నాయి. చూద్దాం చౌక అయితే సంతలోకి వస్తాయి కదా…
