Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » వాసంశెట్టి
ఆంధ్రప్రదేశ్

వాసంశెట్టి

apanalysisBy apanalysisNovember 5, 2025No Comments3 Mins Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

వ్యూహాత్మకంగా వాసంశెట్టి  వ్యాఖ్యలు ….!!

తూర్పులో ఉదయభానుడు

అగ్రకులాల నేతల్లో అందోళన

సొంత సాామాజికవర్గంలో పెద్దన్నగా బాధ్యత  తీసుకున్న వాసంశెట్టి

టీడీపీలోని కొందరు నేతలకు మింగుడు పడని వాసంశెట్టి

ఎం.గణేశ్, జర్నలిస్టు 

ఇటీవల శెట్టిబలిజల వన సమారాధన సన్నాహక సమావేశంలో  రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఎత్తుగడలో భాగమేనా?  వైసీపీని తెరమరుగు చేసేందుకే ఆయన అలా మాట్లాడారా? అంటే అవును అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  తెలుగుదేశం పార్టీకి ఎంతో ప్రయోజనం చేకూరే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని కూడా వారు చెబుతున్నారు. అలాంటప్పుడు మంత్రి వాసంశెట్టి ఎందుకు టార్గెట్ అయ్యారనేది డాలర్ల ప్రశ్నగా ఉంది. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన శెట్టి బలిజ సామాజికవర్గంలో ప్రస్తుతం వాసంశెట్టి సుభాష్ పెద్దన్నపాత్ర పోషిస్తున్నారు. పార్టీలకతీతంగా శెట్టిబలిజలకు చేదోడువాదోడుగా ఉండడమేనా ఆయన చేసిన తప్పు? అందుకే ఆయనను టార్గెట్ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం వెనువెంటనే మంత్రి అయిపోవడం కొందరు నాయకులకు మింగుడుపడలేదు. మంత్రి అయినా ఆయన ఏనాడు తెలుగుదేశం పార్టీ లైను దాటి ప్రవర్తించలేదు. కాని తనకు ఇంతటి గుర్తింపు నిచ్చిన శెట్టి బలిజలను ఏకత్రాటిపైకి తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలన్న రాజకీయ వ్యూహంతోనే సుభాష్ ఆ వ్యాఖ్యలు చేశారని అనిపిస్తోంది. అయితే ఆ వ్యాఖ్యలను వక్రీకరించి సుభాష్ ను టార్గెట్ చేయాలనుకున్న కుట్రలు బెడిసి కొట్టినట్టుగా కనిపిస్తున్నాయి.

ఇటీవల అమలాపురంలో జరిగిన శెట్టి బలిజ కార్తీక వన సమారాధన సన్నాహక సమావేశంలో వాసం శెట్టి సుభాష్ మాట్లాడుతూ మనమంతా ఒకే కుటుంబం, బిసీల్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్నది శెట్టిబలిజలే. కాని రాజకీయాలు వేరు కులాభిమానం వేరు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఒకరినొకరు విమర్శించుకున్నా గాని సామాజికవర్గం పరంగా మనమంతా ఒకటేనన్నారు. వైసీపీలో ఉన్న శెట్టిబలిజలు కూడ తన రాజకీయ ఎదుగదలను ఎంతగానో ప్రోత్స హించారని చెప్పారు. మీనాయకుడిని మంత్రి హోదాలో నేను విమర్శిస్తాను. మా నాయకులకు మీరు విమర్శిస్తారు. అంతవరకే రాజకీయాలు. కాని సామాజిక వర్గం పరంగా మనమంతా ఆత్మీయ అభిమానంతో ఉండాలన్నారు. రాష్ట్ర మంత్రి గా శెట్టి బలిజలకు పెద్దన్నగా ఉన్న సుభాష్ వెంట ఉంటే మనకు ఎంతో కొంత మేలు జరుగుతుందనే ఆలోచనను వైసీపీలో ఉన్న ఆ సామాజికవర్గం వారిలో కలిగించడం వెనుక  ఎంతో రాజకీయ ఎత్తుగడ ఉందనేది అర్ధమవుతోంది.  సన్నాహక సమావేశపు వేదికపై ఉన్న వైసీపీ నాయకుల సమక్షంలోనే సుభాష్ చేసిన కామెంట్లు  చూస్తే అది పూర్తిగా వైసీపీని ఆత్మరక్షణలో పడవేసివిధంగా కనిపిస్తున్నాయి.

అయితే సుభాష్ రాజకీయ వ్యూహాన్ని పసి గట్టలేకపోయిన సొంతపార్టీ నాయకులే మంత్రిని టార్గెట్ చేసి తమ సొంత మీడియాలో అసత్య కధనాలు రాయించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని తెలుస్తున్నది. కోస్త్రాంధ్రా జిల్లాలో ఎంతో బలీయంగా ఉన్న శెట్టి బలిజలను తెలుగుదేశం పార్టీ వైపు తీసుకుని రావాలన్నది సుభాష్  ఆలోచన. ఈ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటే రాజకీయంగా తనకు ఎంతో ఉన్నతి ఉంటుందనేది సుభాష్ వ్యూహాంలో భాగంగా ఉంది. అందుకే ఆయన కులం వేరు రాజకీయాలు వేరు అంటూ వ్యాఖ్యలు చేశారనిపిస్తోంది.

తన సామాజికవర్గంపైన ఎవరికైనా ఆత్మాభి మానం ఉండడం తప్పుకాదు.  వేరే కులం మీద ద్వేష భావం ఉండడం తప్పు .అయితే సుభాష్ కేవలం తన ప్రసంగంలో శెట్టి బలిజల గురించే మాట్లాడేరే తప్ప ఇతర సామాజిక వర్గాలను కించపరిచి మాట్లాడిన దాఖాలాలు లేవు. అటువంటప్పుడు ఆయనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కావడం లేదని శెట్టి బలిజ కులస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనకు శెట్టిబలిజ కులమంటే అభిమానం. నరనరాన నాలో కులాభిమానం ఉంది. మనమందరం ఐక్యంగా ఉండాలని వాసం శెట్టి సుభాష్ తన మనసులోని భావాలను ఆ  సమావేశంలో బహిరంగంగానే వ్యక్తం చేశారు.  రాజకీయవేదికమీదో, బహిరంగసభలోనే మంత్రి సుభాష్ ఈ మాటలు అని ఉంటే తప్పు పట్టవచ్చు. కాని  తన సామాజిక వర్గం సమావేశంలో చేసిన వ్యాఖ్యాలను చిత్రీకరించడం వెనుక అగ్రవర్ణాలకు చెందిన కొందరు పాత్ర ఉందనేది శెట్టిబలిజ ప్రతినిధుల ఆరోపణ.  రాజకీయంగా సుభాష్  ఎదుగు దలను అడ్డు కోవాలనే యత్నంలో భాగంగానే ఇంత రాద్దాంతం చేస్తున్నారని వారు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అగ్రవర్ణాలకు చెందినవారి కుటుంబాలు ఆయా రాజకీయ పార్టీల్లో ఉంటూ అప్పుడప్పుడు కలుసుకుంటే తప్పు లేనిది తమ సామాజిక వర్గం సమావేశంలో ఇతర పార్టీల నాయకులతో కలసి మంత్రి సుభాష్ పాల్గొంటే పార్టీ లైన్ ను ఎలా దాటినట్టు అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు.

యువమంత్రి వాసంశెట్టి సుభాష్  సామాజిక వర్గం పరంగా గట్టి పునాదులు వేసుకుంటే తమ రాజకీయ భవిష్యత్తు అంధకారం అవుతుందనే అసూయతోనే  కుట్రలకు తెరతీస్తున్నారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవంగా మంత్రి సుభాష్ తన సామాజిక వర్గానికి పెద్దన్నగా నిలవడం  తెలుగుదేశానికి ప్లస్ అయితే వైసీపీకీ మాత్రం పెద్ద డ్యామేజే అని చెప్పాలి. నిజంగా సుభాష్

Post Views: 182
His comments beniftted to TDP. Minister Vasamsetty comments OC cast leaders varried about Vasamsetty vasamsetty acts as Peddanna in goud caste.
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

గోదాదేవి కళ్యాణం

January 14, 2026

రాయల్ సర్వీస్ ట్రస్ట్

January 5, 2026

మన్నవ

December 30, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.