ఏపీ ఎనాలిసిస్, విజయవాడ.
తొలకరికి ముందే వేసవిలోనే అకాల వర్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే పదిమందికి పైగా మృత్యువాతకు గురయ్యారు .దాదాపు 6 వేఊ ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆ పంటలకు నష్టపరిహారం వెంటనే అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఆదేశాలు ఇచ్చారు. వాతావరణ హెచ్చరికలకు తగ్గట్టుగానే పకృతి బీభత్సం సృష్టిస్తుంది. ఆదివారం ఉదయం ఒక్కసారిగా ఏర్పడిన వాతావరణంలో మార్పులతో విజయవాడ తో పాటు పలు ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి .ఉరుములు మెరుపులు విపరీతమైన వీధురు గాలులతో జనం అల్లాడిపోయారు. తిరుపతి జిల్లాతో పాటు బాపట్ల ఏలూరు పల్నాడు కృష్ణా తదితర జిల్లాల్లో పదిమందికి పైగా చనిపోయారు. 6 వేల ఎకరాల్లో పంట నష్టం జరగ్గా వీటిలో అత్యధికంగా వరి మామిడి పంటలు దెబ్బతిన్నాయి. ఈ పంట నష్టాలను అంచనా వేసి మంగళవారం సాయంత్రంలోగా రైతులకు నష్టపరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు .అలాగే చనిపోయిన వారికి ఎక్స్ గ్రే షియా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు .ఈ అకాల వర్షాలు పట్ల రైతులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు తగిన సూచనలు సలహాలు ఇస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారు.
