విశాఖపట్నంలో నూతన ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు కాగ్నిజెంట్ (Cognizant) ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ‘ఎక్స్’లో వెల్లడించింది. విశాఖలోని కాపులుప్పాడలో 22 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.
నూతన క్యాంపస్‌తో సుమారు 8 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని కాగ్నిజెంట్ తెలిపింది. ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రంగంలో ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది. 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని పేర్కొంది. కంపెనీ విస్తరణకు సహకరించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
