Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » వైసీపీలో ప్రకంపనలు
ఆంధ్రప్రదేశ్

వైసీపీలో ప్రకంపనలు

apanalysisBy apanalysisApril 21, 2025Updated:April 21, 2025No Comments4 Mins Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


వైసిపి బాస్ ని టార్గెట్ గా సిట్ విచారణ
ఆ దిశగా విజయసాయి , మిధున్ రెడ్డిలపై విచారణ
కసిరెడ్డి కోసం జల్లెడ
వైసిపి చుట్టూ బిగుస్తున్న లిక్కర్ స్కాం ఉచ్చు

ఏపీ ఎనాలిసిస్, విజయవాడ
లిక్కర్ స్కామ్ లో వైసీపీ బాసును టార్గెట్ చేసే విధంగా సిట్ దర్యాప్తు వేగవంతం అవుతుందా? అంటే అవుననే సమాధానమే ఎక్కువుగా వినపడుతోంది. కుంభకోణంపై వేగంగా జరుగుతున్నవిచారణ వైసీపీలో ప్రకంపనలు రేపుతుంది. జగన్ కు కుడి భుజంగా ఇటీవలి వరకు కొనసాగిన విజయసాయిరెడ్డి ఈ విచారణలో ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వకపోయినప్పటికీ, ఆరోపణలు ఎదుర్కోంటున్న కసిరెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు. అతనో క్రిమినల్ అని, ఇందులో అతని పాత్రే ఎక్కువుగా ఉందని బహిరంగంగా ప్రకటించారు. మరోవైపు కసిరెడ్డి ఇప్పటి వరకు సిట్ విచారణకు హాజరుకాకుండానే విజయసాయి రెడ్డిపై తీవ్ర స్ధాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు. అనేక అంశాలతో కూడిన ఒక వీడియోను కూడా విడుదల చేశారు. సిట్ విచారణ ఇంకా ఒక దశకు చేరకుండానే ఈ ఇద్దరు వ్యక్తులు బాహాటంగా ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. కసిరెడ్డి కూడా విచారణ కు హాజరైతే కుంభకోణంలోని అంశాలన్నీ త్వరగానే బయటపడే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయం అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు వైసీపీ వర్గాల్లోనూ వినపడుతోంది. ఆదే జరిగితే వైసీపీ బాస్ కు, పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని పార్ఠీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం అమ్మటమే కాకుండా ఇష్టానుసారంగా ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో నేటి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గత ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయడంతో పాటు మద్యం కొనుగోలు చేసే వారి నోరు మూయించింది. మేము అమ్మేది ఇలాగే.. ఇష్టమైతే కొనుక్కో.. లేకుంటే వెళ్లిపో.. అంటూ ఎక్సైజ్ పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడింది. మద్యం ప్రియులు గత ప్రభుత్వంలో ఐదేళ్లూ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతూనే కొనుగోలు చేశారు. పైగా రాత్రి సమయాల్లో షాపుల వద్ద కనీసం లైట్లు కూడా ఉండేవి కాదు. ఎందుకంటే మద్యం బ్రాండ్స్ కనిపించకుండా ఉండటం కోసం ఈ విధంగా చేసే వారనే ఆరోపణలు ఉన్నాయి. షాపులో ఉండే అమ్మకందారులు కూడా కొనుగోలు దారులకు మర్యాద ఇచ్చే వారు కాదు. మద్యానికి అలవాటు పడిన వారు నిత్యం ప్రభుత్వాన్ని తిట్టుకుంటూనే కొనుగోలు చేశారు.


దశల వారీగా మధ్య నిషేదం చేస్తానని ప్రకటించిన జగన్ మద్యం అమ్మకాల్లో తమ ప్రభుత్వ పెద్దలు దోపిడీ చేస్తుంటే చూస్తూ ఉన్నారంటే ఆయన కూడా ఇందులో భాగస్వామేననే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో విజయసాయి రెడ్డి తరువాత మాజీ ఎంపీ మిధున్ రెడ్డిపై సిట్ విచారణ ప్రారంభం అయింది. వీరితోపాటు లిక్కర్ కుంభకోణంలో కీలక పాత్ర వహించారనే ఆరోపణలు వినపడుతున్న రాజ్ కసిరెడ్డిని విచారించేందుకు సిట్ ఇప్పటికే నాలుగుసార్లు నోటీసులు ఇచ్చింది. అయితే కసిరెడ్డి విచారణకు హాజరుకాకుండా న్యాయపరంగా ముందస్తు బెయిల్ పొందడానికిపోరాటం చేస్తున్నారు.

అయితే రాజ్ కసిరెడ్డి డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈడీ క్రియేషన్స్ వంటి కంపెనీలను కసిరెడ్డి ఏర్పాటుచేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కంపెనీల ద్వారా నాసిరకం ‘J’ బ్రాండ్లను ప్రభుత్వ మద్యం షాపులకు సరఫరా చేసి, అక్రమ లాభాలు ఆర్జించినట్లు సిట్ విచారణలో తేలింది. అక్రమంగా సంపాదించిన డబ్బును సినిమా నిర్మాణం, రియల్ ఎస్టేట్, ఆసుపత్రులు, ఇన్ఫ్రా ప్రాజెక్టులలో పెట్టుబడులుగా మళ్లించినట్లు పోలీసులు గుర్తించారు. హైకోర్టు అతని ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన తర్వాత అతను దేశం విడిచి అమెరికాకు పారిపోయినట్లు సమాచారం. పోలీసుల వద్ద ఆ సమాచారం ఉంది. హైదరాబాద్లోని అతని నివాసాలు, కార్యాలయాలు, బినామీ సంస్థలపై సిట్ దాడులు నిర్వహించి, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. దీనితో అతనిపై దృష్టిని మరింత పెంచింది.

  • విజయసాయి రెడ్డిపైనే అందరికీ అనుమానం

ఈ విచారణ మరింత వేగంగా జరుగుతుండటంతో పార్టీ కేడర్ లో ఆందోళన ప్రారంభం అయింది. ఎందుకంటే విజయసాయి రెడ్డి వ్యవహారం ఎలా మారుతుందోనని ఆందోళన చెందుతున్నారు. గతంలో వలే అయన ఉండక పోవచ్చనే అభిప్రాయాలు లేకపోలేదు. ఆయన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలతో వైస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయలో జగన్ కు అనేక రకాలుగా సాయపడ్డారనేది తెలిసిన విషయమే. అయితే ఇద్దరూ సీబీఏ కేసుల్లో ఇరుక్కుపోయారు. ఏ-1గా వైస్ జగన్, ఏ-2 గా విజయసాయి రెడ్డిలు అనేక కేసుల్లో ఉండిపోయారు. క్విడ్ ప్రోకో కింద జగన్ తోపాటు విజయసాయి కూడా అరెస్టు అయ్యారు. ఆ సమయంలో ఇద్దరు 14 నెలలపాటు జైలు జీవితం జగడిపారు. సిబీఐ విచారణలో విజయసాయి రెడ్డి అప్పట్లో జగన్ కు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం చెప్పినా, జగన్ పై అప్పుడే తుది తీర్పు వెలువడి ఉండేది. ఆయన జైలుకు వెళ్ళి ఉండే వారు. అయితే విజయసాయి రెడ్డి జగన్ కు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం చెప్పలేదు సరికదా అనుకూలంగా వ్యవహరించారు. దీంతో అన్ని కేసుల్లోనూ వీరు బెయిల్ పొందారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామ క్రమంలో జగన్ వైసీపీని ఏర్పాటు చేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. 2019 లో అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేసుల సమయంలో తనకు అనుకూలంగా వ్యవహరించిన విజయసాయి రెడ్డిని పార్లమెంట్ సభ్యునిగా చేశారు. విశాఖ నగరాన్ని ఆయనకు అప్పగించారు. ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పాలనలో విజయసాయి రెడ్డి విశాఖను అడ్డగా చేసుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డనే ఫిర్యాదులు ఉండటంతో జగన్ అయన ప్రాధాన్యతను ఎన్నికలకు ముందే తగ్గించారు. అయితే ఎన్నికల్లో వైసిపీ ఘోరంగా ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిపోయాయి. ఎన్నికల ఫలితాల తరువాత జగన్ కు, విజయసాయి రెడ్డికి మధ్య విబేధాలు పెరిగాయి. కోటరీ మాటలు వింటూ తనకు జగన్ ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ విజయసాయి రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత కూడి ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితులు నెలకొన్నాయి. అప్పటి స్నేహం, అనుబంధం విజయసాయి రెడ్డి, జగన్ ల మధ్య లేకపోవడంతో సిట్ విచారణలో అన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయనే భయం పార్టీని వెన్నాడుతోంది. విజయసాయి రెడ్డి ఇప్పటి సిట్ విచారణలో జగన్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే జగన్ లిక్కర్ కేసులో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. విజయసాయి రెడ్డితోపాటు మిధన్ రెడ్డి, కసిరెడ్డిలపై విచారణ పూర్తయితే లిక్కర్ స్కాం పార్టికి ఉరితాడు అవుతుందనే భయం అందరిలోనే నెలకొన్నది. దీనితో సిట్ విచారణ పార్టీ భవిష్యత్, తమ జీవితాలపై ప్రభావం చూపక తప్పదనే భావన పార్టీ నేతల్లో నెలకొన్నది.

Post Views: 145
cinema creating tremors in ap politics empire in hunger strike only 2 ysrcp mp's remained in pawan words there is reality in the struggle nara lokesh & pawan kalyan yatra's will create tremors in ycp others in hospital ruckus in assembly ruckus in assembly sessions rythu bharosa scheme in lok sabha suspence in ysrcp mps resignation ycp leaders in assembly ysrcp leaders conduct rail roko in ap for special status ysrcp plenary in ap
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు

April 1, 2026

నియోజకవర్గాల పునర్విభజనతో మరిన్ని అవకాశాలు: పవన్‌ కల్యాణ్‌

March 24, 2026

రాష్ట్రంలో పెద్దఎత్తున తాగునీటి ప్రాజెక్టుల పనులు

March 23, 2026
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.