ఇటువంటి వార్తలు శాంతి భద్రతలకు భంగం విఘాతం కలిగిస్తాయి.
ఏపీ స్టేట్ బ్యూరో,
ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్.? పేరిట అసత్య కథనాలను ప్రచారం చేస్తున్న వారిపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించనున్నదని డీజీపీ హరీష్ కుమార్ గుప్త హెచ్చరించారు. ప్రభుత్వాన్ని, పోలీసు విభాగాన్ని అపఖ్యాతిపర్చే దురుద్దేశంతో ప్రచారం చేసే మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇవి ప్రజలను తప్పుదారి పట్టించడమే కాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముప్పుగా మారే ప్రమాదం ఉందన్నారు. విచారణలో భాగంగా, ఈ కేసుకు సంబంధించిన అనుమానితులను, సాక్షులను చట్టబద్దంగా ప్రశ్నించడం జరిగిందని వివరించారు. ఎవ్వరినీ అక్రమంగా అరెస్టు చేయడం గాని, లాకప్ హింసకు పాల్పడటం గాని జరుగలేదని స్పష్టం చేశారు. మృతుని కుటుంబ సభ్యులను, బంధువులను బెదిరించడం గాని, బలవంతం చేయడం గాని జరగలేదని వివరించారు. వాస్తవాలకు విరుద్ధంగా వార్తలను ప్రచరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
