Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » సాఫ్ట్వేర్ కి ఇక కష్టాలే
అంతర్జాతీయం

సాఫ్ట్వేర్ కి ఇక కష్టాలే

apanalysisBy apanalysisMay 22, 2025No Comments2 Mins Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

లక్షలు జీతాలు ఇక గగనమే.!

ఉద్యోగాలు ఊడిపోయే రోజులు దగ్గరలోనే

ఏపీ స్టేట్ బ్యూరో,

ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కాలర్ ఎగరేసి చెప్పుకునే రోజులు ఉండేవి. డాక్టర్లు, టీచర్లు ఇంకెవరైనా సరే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ముందు కొంచెం తక్కువే అనే భావన ఉండేది. ఇంజనీరింగ్ చదవకపోయినా లక్షల్లో జీతాలు సంపాదించే అదృష్టం ఈ రంగానికే దక్కింది. దీంతో చాలామంది హైలైఫ్ అలవాటు పడ్డారు. కానీ, ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. “పెరుగుట విరుగుట కొరకే” అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఎక్కువ జీతాలు తీసుకుంటున్నామని సంబరపడకండి. ఉద్యోగాలు ఊడిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల భవిష్యత్తు ఏమవుతుందో చూద్దాం!

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఇప్పుడు అనుభవిస్తున్న భారీ జీతాలు శాశ్వతం కాదని జోహో సీఈవో శ్రీధర్ వెంబు కుండబద్దలు కొట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) వంటి టెక్నాలజీలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను గణనీయంగా తగ్గిస్తున్నాయని ఆయన తేల్చి చెప్పారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు మెకానికల్, సివిల్ ఇంజనీర్లు, కెమిస్టులు, టీచర్ల కంటే ఎక్కువ జీతం పొందడం అనేది వారికి ప్రత్యేకంగా వచ్చిన హక్కు ఏమీ కాదని, అది ఎప్పటికీ ఇలాగే ఉంటుందని అనుకోకూడదని ఆయన సూచించారు. AI, అడ్వాన్స్‌డ్ టూల్స్ రాకతో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో విప్లవం వస్తోంది. ఇది చాలా మంది ఉద్యోగాలను తీసేస్తుంది.

గత ఏడాది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) రిపోర్ట్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలపై AI ప్రభావం ఉంటుందని తేలింది. కానీ, అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ఈ ప్రభావం ఏకంగా 60 శాతం వరకు ఉంటుందని సాఫ్ట్‌వేర్ రంగంలోని కొత్త నిపుణులు భయపడుతున్నారు. ఈ మార్పులను అర్థం చేసుకుని, తమను తాము మార్చుకున్న వారికే భవిష్యత్తు ఉంటుందని వారు అంటున్నారు. ఒకప్పుడు ఇంటెల్ మాజీ సీఈవో ఆండీ గ్రోవ్ అన్నట్టు భయపడేవాళ్లే బతుకుతారు అనేది ఇప్పుడు నిజమవుతోంది. ఇటీవల గూగుల్, మెటా లాంటి పెద్ద కంపెనీలు AIతో కోడ్ రాసుకునే టెక్నాలజీని కనిపెట్టాయి. దీంతో ఆయా కంపెనీలు ఎక్కువ జీతాలు తీసుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను పెద్ద మొత్తంలో తీసేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాల కోత ఉంటుందని ఈ పెద్ద కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. ఇదంతా కేవలం AI, అడ్వాన్స్‌డ్ టూల్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వల్లే జరుగుతోంది. ముందు ముందు ఇది మరింత తీవ్రంగా ఉండబోతోంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అలర్ట్ కావాల్సిందే. ఇప్పటివరకు “అబ్బో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్” అనుకున్నవాళ్లు రేపు “పాపం” అనే పరిస్థితికి వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదు.

Post Views: 162
employess may terminated no highest salaries
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

క్రైస్తవంలోకి మారినవారు ఎస్సీ హక్కులు పొందలేరు: సుప్రీంకోర్టు

March 24, 2026

రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌! .. టికెట్‌ క్యాన్సిలేషన్‌కు కొత్త రూల్స్‌

March 24, 2026

ఆశావాహుల‌కు గుడ్ న్యూస్‌.. పెరగ‌నున్న అసెంబ్లీ, లోక్ స‌భ స్థానాలు

March 24, 2026
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.