ఏప్రిల్ 30న సింహాచలంలో చందనోత్సవం
స్వామి వారి నిజరూప దర్శనం చేసుకునే అవకాశం
కుటుంబ సమేతంగా హాజరుకానున్న సీఎం
సింహాచలం, ఏప్రిల్ 17.

సింహాచలం దేవస్థానంలో ఈనెల 30న చందనోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కుటుంబ సభ్యులు కూడా హాజరుకానున్నారు. సింహాచలంలో చందనోత్సవ నిర్వహణ, ఆలయ అభివృద్ధి, పంచ గ్రామాల సమస్య పరిష్కారాలపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తునికి ఉచితంగా లడ్డూ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.