మంత్రులు, శాసన సభ్యుల నుంచి వెలువడని స్పష్టమైన ప్రకటన
విజయ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు, మంత్రి సారధిల నుంచి స్పందన
ఇద్దరు పేద బాలికలను దత్తత చేసుకున్న చలసాని, ఐఐటీ సీటు సాధించిన విద్యార్ధులకు సాయం ప్రకటించిన మంత్రి సారధి
ఏపీ ఎనాలిసిస్, విజయవాడ.
ముఖ్యమంత్రి చంద్రబాబు అమలులోకి తీసుకువచ్చిన పీ-4 పట్ల శాసన సభ్యుల నుంచి స్పందన కనిపించడం లేదు. ఈ పథకం అమలు పట్ల ప్రజాప్రతినిధులు ఇంత వరకు పెద్దగా దృష్టి సారంచ లేదు. ఒకరిద్దరు ఆ పథకం గురించి ప్రస్తావించకుండానే పేదలకు, మెరిట్ విద్యార్ధులను ప్రోత్సహించేందుకు తమ సొంత నగదు ఖర్చు చేస్తామని ముందుకు వచ్చారే కానీ పీ-4 పథకం పట్ల ఆసక్తి కనపరచలేదు. దీనిపై ఇంత వరకు ఎవరూ బహిరంగ ప్రకటన చేయలేదు. కూటమి ప్రభుత్వంలో ఆర్ధికంగా వెసులుబాటు కలిగిన మంత్రులు, శాసన సభ్యులు, ప్రభుత్వ కార్పొరేషన్ల పదవులు నిర్వహిస్తున్న వారి సంఖ్యకు కొదవే లేదు. ఈ పథకం అమలు ద్వారా రెండు రకాల ప్రయోజనాలు కలిగే అవకాశం ఉన్నప్పటికీ, ఇంత వరకు స్పంధించకపోవడం పట్ల రాజకీయ పార్టీల్లో చర్చ కొనసాగుతుంది. ఈ పథకానికి ఖర్చు చేసే మొత్తానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు లభించనున్నది. రెండోది ముఖ్యమంత్రి తన సొంత పథకంగా ప్రకటడించడంతో ఆయన నుంచి కూడా మొప్పు పొంద వచ్చు. అయితే స్పందన నామమాత్రంగానే కనపడుతోంది.

ఈ పథకం వల్ల రాష్ట్రంలో పేదరికం రూపురేఖలు మారిపోతాయని సీఎం చంద్రబాబు అంటున్నారు. ఆగస్టు 15 వ తేదీనాటికి 15 లక్షల మంది బంగారు కుటుంబాలను ఎంపిక చేయాలనే లక్ష్యంతో ఆయన అడుగులు వేస్తున్నారు. అంటే.. దాతల ఔదార్యాన్ని స్వీకరించే వారన్నమాట. పేదలకోసం సొమ్ములు ఇచ్చే వారిని మార్గదర్శి అని వ్యవహరిస్తున్నారు.తాను కూడా మార్గదర్శిగా ఉంటానంటూ.. కుప్పం నియోజకవర్గంలో తాను 250 కుటుంబాలను దత్తత తీసుకుంటానని చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆయన అనుకుంటున్న లక్ష్యం చేరడానికి ఆగస్టు 15 లోగా ఇంకా కనీసం రెండు లక్షల మంది మార్గదర్శులు ముందుకు రావాలని అధికారులు లెక్కలు తేలుస్తున్నారు.ఈ నేపథ్యంలో కొత్తగా మార్గదర్శులను ఎంపిక చేసే బాధ్యతను కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు తీసుకోవాలని చంద్రబాబునాయుడు అంటున్నారు. అసలు సమస్య ఇక్కడే వస్తోంది. నిజానికి, తెలుగుదేశం పార్టీ, ఇతర కూటమి పార్టీ ఎమ్మెల్యేలు స్థానికంగా పారిశ్రామికవేత్తలను, సంపన్నులను సంప్రదించి.. పీ4లోకి భాగస్వాములను చేయడానికి సుముఖంగా లేరు. ఇలాంటి పని చేస్తే తమకు ఆ పారిశ్రామిక వేత్తల నుంచి తమకు అవసరమైన సమయంలో సాయం లభించకపోవచ్చనే భాధ శాసన సభ్యుల్లో కనపడుతోంది.
ఇప్పటి వరకు ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఇద్దరు కూటమి నేతలు తమ వంతు సహకారం అందించారు. వారు కూడా ఈ పథకం గురించి బహిరంగంగా ప్రస్తావించలేదు. విజయ డయరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు తన పుట్టిన రోజు సందర్భంగాపేదలకు తన వంతుగా సాయం చేస్తానని ప్రకటించారు. ఇద్దరు అనాధ బాలికలను పూర్తిగా దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

