Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » హరిహర వీరమల్లు’ కొత్త రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..
సినిమా

హరిహర వీరమల్లు’ కొత్త రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..

apanalysisBy apanalysisJune 21, 2025Updated:June 21, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

‘
హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) పార్ట్‌ 1 కొత్త విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాని జులై 24న (Hari Hara Veera Mallu Release Date) రిలీజ్‌ చేయనున్నట్టు చిత్ర బృందం శనివారం ఉదయం ప్రకటించింది. ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ నెల 12న బాక్సాఫీసు ముందుకు రావాల్సి ఉండగా మరోసారి పోస్ట్‌పోన్‌ అయింది.
పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) రాజకీయాల్లో బిజీగా ఉండటం తదితర కారణాలతో ఈ మూవీ షూటింగ్‌ వాయిదా ఆలస్యమవుతూ వచ్చింది. క్రిష్‌ కొంతభాగం తెరకెక్కించిన తర్వాత నిర్మాత ఎ.ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. పవన్‌ ఇందులో చారిత్రక యోధుడిగా మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. బిజీ షెడ్యూల్‌ కారణంగా పవన్‌ రాత్రి 10 గంటలకు డబ్బింగ్‌ మొదలుపెట్టి ఏకధాటిగా నాలుగు గంటల్లో పూర్తి చేయడం విశేషం. కొన్నాళ్ల పాటు సినిమా సెట్స్‌పైనే ఉండటంతో నిర్మాతపై ఆర్థికంగా అదనపు భారం పడిందని భావించిన పవన్‌.. తాను అడ్వాన్స్‌గా తీసుకున్న పారితోషికం మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారు. ‘అసుర హననం’ పాటలోని ఫైట్స్‌ అన్నీ పవన్‌ కల్యాణే డిజైన్‌ చేశారని జ్యోతికృష్ణ ఓ సందర్భంలో తెలిపారు. ఈ సినిమా కోసం పవన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రాక్టీస్‌ చేశారు.

ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌. బాబీ దేవోల్, అనుపమ్‌ ఖేర్, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తొలి భాగం ‘హరి హర వీరమల్లు: పార్ట్‌ 1- స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో రానుంది.

Post Views: 67
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

ఓజీ నుంచి ప్రియాంక మోహన్‌ లుక్‌..

August 17, 2025

కూలీ’.. ‘వార్‌2’ టికెట్‌ బుకింగ్స్‌ ఓపెన్‌

August 12, 2025

ఎవరు ఎన్ని అనుకున్నా.. బొమ్మ అదిరిపోయింది

August 11, 2025
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.