కష్టపడితేనే ఉన్నత లక్ష్యాలు సొంతమవుతాయి
మంత్రి కొలుసు పార్థసారథి
ఏపీస్టేట్ బ్యూరో.
క్రమశిక్షణ, మంచి ఆలోచనతో ముందుకు సాగితే లక్ష్యాలు సాధించి ఉజ్వల భవిష్యత్ పొందవచ్చని, ప్రతి ఒక్కరూ ఉన్నతస్థానాలు అధిరోహించవచ్చని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఉద్బోధించారు. ఆదివారం ఉదయం నెల్లూరు నగరంలోని కొండాయపాలెం గొలగమూడిరోడ్డులో గల యాదవ భవన్‌లో యాదవ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని , విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. యాదవ విద్యార్థులతో పాటు ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల్లోని ప్రతిభ గల విద్యార్థులను కూడా ప్రోత్సహించేందుకు యాదవ సంఘం నేతలు నిర్ణయం తీసుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. రాష్ట్రంలో యువనేత లోకేష్‌బాబు పరిశ్రమల ఏర్పాటుకు, ఉద్యోగ ఉపాధి కల్పనపై ప్రత్యేక శ్రద్ధపెట్టారని చెప్పారు. సమాజంలో ఉన్నతంగా ఎదిగేందుకు అనేక అవకాశాలు ప్రస్తుతం ఉన్నాయని, ప్రతిఒక్క అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. యాదవ సంఘం అభివృద్ధికి తన సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తామని చెప్పిన మంత్రి, యాదవ భవన్ పూర్తి చేసేందుకు తనవంతుగా రూ.లక్ష విరాళాన్ని అందించారు.
