Close Menu
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
apanalysis
Button
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
apanalysis
Home » Web Site » 2న పనుల పునరుద్ధరణ ప్రారంభానికి రండి…ప్రధాని మోదీకి చంద్రబాబు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్

2న పనుల పునరుద్ధరణ ప్రారంభానికి రండి…ప్రధాని మోదీకి చంద్రబాబు ఆహ్వానం

apanalysisBy apanalysisApril 26, 2025No Comments1 Min Read
Facebook Twitter Pinterest Email Telegram WhatsApp
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అభివృద్ధి ప్రాజెక్టులపై వారితో విస్తృతంగా చర్చించారు. మియావాకీ విధానంతో పచ్చదనం పెంపు, ఉగ్రవాదంపై కఠిన నిర్ణయాలకు మద్దతు వంటి అంశాలపై ప్రధానితో భేటీ సందర్భంగా చర్చించారు.
అద్భుతమైన భవిష్యత్‌ దిశగా రాష్ట్రం జరిపే ప్రయాణంలో అమరావతి చరిత్రాత్మక మైలురాయి అవుతుంది. ఈ ప్రత్యేక ఘట్టాన్ని ప్రారంభించేందుకు, రాష్ట్రాభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లిఖించడానికి అమరావతికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించాను. ఆయన అంగీకరించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి ఆయన పలు సూచనలు కూడా చేశారని వెల్లడించారు. చంద్రబాబు శుక్రవారం ఢిల్లీలో ప్రధానితో సమావేశమయ్యారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరూ దాదాపు గంటసేపు చర్చలు జరిపారు. రాజధాని నగర నిర్మాణం చేపడుతున్న తీరును, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిని, విశాఖ ఉక్కు కర్మాగారం పనితీరును వివరించారు.
రాజధాని పనులు ప్రారంభించేందుకు తాను తప్పకుండా వస్తానని చెప్పిన మోదీ.. రాజధానిని వేగవంతంగా నిర్మించేందుకు పలు సూచనలు చేశారు. దేశంలో అనేక మౌలిక సదుపాయాలను తన ప్రభుత్వం ఎంత వేగంగా నిర్మించిందో సీఎంకు తెలియజేశారు. అమరావతిలో పచ్చదనం పెంచేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని.. జపాన్‌ వన్య శాస్త్రవేత్త అకిరా మియావకీ అనుసరించిన అటవీ మొక్కల పెంపకం పద్ధతులను అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా పట్టణాల్లో స్వయం ఆధారిత సాంద్ర అడవులను పెంచేందుకు మియావాకీ సహజ అటవీ విధానాలు తోడ్పడతాయని, జీవ వైవిధ్యానికి కూడా ఉపయోగమని పేర్కొన్నారు

Post Views: 81
Share. WhatsApp Facebook Twitter Email Telegram
apanalysis
  • Website

Related Posts

ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు

April 1, 2026

నియోజకవర్గాల పునర్విభజనతో మరిన్ని అవకాశాలు: పవన్‌ కల్యాణ్‌

March 24, 2026

క్రైస్తవంలోకి మారినవారు ఎస్సీ హక్కులు పొందలేరు: సుప్రీంకోర్టు

March 24, 2026
Leave A Reply Cancel Reply

Facebook X (Twitter) Instagram Pinterest
  • మొదటి పేజి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాజకీయాలు
  • ప్రత్యేకం
  • క్రీడలు
  • సినిమా
  • క్రైం
  • వాణిజ్యం
  • విద్య
© 2026 ThemeSphere. Designed by ThemeSphere.

Type above and press Enter to search. Press Esc to cancel.