చాలామంది మహిళలకు రుతుస్రావం సమయంలో
నొప్పిగా ఉంటుంది. ఒక్కోసారి నొప్పి తీవ్రంగా ఉండి చాలా ఇబ్బంది కలుగజేస్తుంది.
మెన్సెస్తో పాటు నడుం నొప్పి
, వక్షోజాల నొప్పి కూడా రావచ్చు.
పొత్తికడుపులో విపరీతమైన నొప్పి కూడా ఉండవచ్చు.

పరిష్కారం :
  • సరైన పోషకాహారం, సరళమైన వ్యాయామాలతో పీరియడ్ పెయిన్స్ నుండి ఉపశమనం పొందవచ్చు.

వీటితో పాటు చిన్నచిన్న చిట్కాలు
పాటించి చూడండి.

  • పీరియడ్కు ముందు వారం రోజుల నుండి
    ఉప్పును తగ్గించండి.
  • మాంసాహారం తక్కువగా తింటే మంచిది. అంటే
    వారానికి ఒక్కసారి మాత్రమే తినవచ్చు.
  • మసాలా దినుసులు, కెఫేన్ ఉండే పానీయాలు అంటే టీ, కాఫీ, కొన్ని రకాల చాక్లెట్లు మరియు నూనె
    ఎక్కువగా వాడే వేపుళ్లు
    , వంటివి తినడం మానుకోవాలి.
  • కొబ్బరి నీరు అధికంగా తాగితే మంచిది.
  • నొప్పి అధికంగా ఉన్నప్పుడు కడుపు కింది
    భాగంపై వేడి నీళ్ల బాటిల్ పెట్టుకుంటే కొంచెం ఉపశమనం కలుగుతుంది.
  • నడుము కింద తలగడ ఉంచుకోండి.
  • ఉదయం పూట 10 తులసి ఆకులు నమిలి మింగి
    ఒక గ్లాసు నీరు తాగితే మంచిది.

Share.
Leave A Reply

Exit mobile version