మనలో చాలామందికి
నీటివిలువ
, మన ఆరోగ్యంపై నీటి ప్రభావం ఎంత అనేది తెలియదు. కాబట్టే దప్పికైతే తప్ప నీరు
తాగరు. నీరు మనదేహంలో ఎంతో ప్రముఖస్థానాన్ని వహిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య
పరిరక్షణలో ఎలాంటి పాత్ర వహిస్తుందో తెలుసుకుందాం.
మనశరీరంలో 60-70శాతం ఉన్నది
నీరే. మెదడు
, కండరాలు, ఊపిరితిత్తులు, రక్తంలో ప్రధానభాగం నీరే. మన శరీర ఉష్ణోగ్రతను
మెయిన్
టెయిన్ చేసేది నీరే. మన
శరీరంలోని అన్ని భాగాలకూ న్యూట్రియంట్సును పంపేది నీరే. శరీరంలోని ఆక్సిజన్ను
కణానికి నీరే తీసుకువెళుతుంది. శరీరంలోని మలినాలను తొలగించేది
, జీర్ణక్రియకు
తోడ్పడేది
, రక్తం, మూత్రం తయారీల్లో ప్రముఖపాత్ర వహిస్తోంది నీరే. శరీరంలో నీటిశాతం తగ్గితే, డీ హైడ్రేషన్
రకరకాల తలనెప్పులు
, కీళ్లనెప్పులు, కండరాల నెప్పులు ప్రారంభం అవుతాయి. సరైన
మంచినీరు శరీరానికి మీరు అందించకపోతే
, మలబద్దకం ఏర్పడి అనేక రుగ్మతలకు దారితీస్తుంది
  • ప్రతి మనిషీ
    రోజుకు
    5,6 లీటర్ల నీరు
    త్రాగాలి. 
  • వ్యాయామం చేసే సమయంలో ప్రతీ ఇరవై నిముషాలకి రెండు గ్లాసుల  నీరు విధిగా తాగాలి. వి
  • మాన ప్రయాణం చేసేటప్పుడు
    ప్రతీ గంటకూ పావులీటరు నీరు తప్పక తాగాలి. 
  • మంచినీరు సమయానికి అందకపోతే డీహైడ్రేషన్
    కు గురై అదే సమయంలో మెటబాలిజం రేటే మూడు శాతం వరకూ తగ్గిపోతుంది. 
  • మంచినీరు
    శరీరానికి అందకపోతే శరీరం నీరసించిపోతుంది. ఏకాగ్రత నశిస్తుంది. ఏ పనిచేయలేరు.
    కళ్లుబైర్లు కమ్ముతాయి. షార్ట్ టర్మ్ మెమరీ దెబ్బతింటుందని కూడా డాక్టర్లు
    చెబుతున్నారు.
  • ప్రతిరోజూ విధిగా
    8,10 గ్లాసులు నీరు తక్కువ కాకుండా తాగేవారికి
    బ్లాడర్ కేన్సర్ సంభవించే అవకాశం తక్కువ. 
  • శరీరానికి నీరు శాతం తగ్గితే శరీర కాంతి
    కోల్పోతుంది. ముడుతలు పడుతుంది. వదులుగా అయిపోతుంది చర్మం. 
  • కాఫీ తాగే అలవాటున్న
    వారు అదనంగా రెండు కప్పుల నీరు తాగాల్సి ఉంటుంది. కారణం కాఫీలోని కెఫైన్ కారణంగా
    మూత్రం అధికంగా వచ్చి శరీరం డీహైడ్రేషన్ కు దారితీసే అవకాశం ఉంది. ఓ రకమైన
    తలనొప్పి కూడా వస్తుంది. మీ గుండె ఆరోగ్యంగా పనిచేయాలన్నా తప్పక పదిగ్లాసు నీరు
    తాగాల్సిందే. అశ్రద్ధ చేయకండి. 
  • ఆహారం తిన్నాక రెండు గంటల అనంతరం నీరు తాగాలి. 
  • హారంతో పాటు, ముద్ద ముద్దకు నీరు తాగడం మంచి పద్ధతి కాదు. 
  • గోళ్లు, జుట్టు, శరీరం అన్నిభాగాలూ ఆరోగ్యంగా ఉండాలంటే మీరు 8-10గ్లాసులు వాటర్
    తాగాల్సిందే. 
  • కిడ్నీలో రాళ్ళతో బాధపడేవారు ఎంత ఎక్కువగా నీరు తాగితే అంత మంచిది.
    మంచినీటిని పరిశుభ్రంగా ఉన్న ప్రదేశం నుండీ ఫిల్టర్ చేసి త్రాగడం మంచి పద్దతి.
    ఎక్కడ పడితే అక్కడ నీరును తాగకూడదు. 
  • ఆహారం వండి వార్చేటప్పుడు, స్నానానికి, పరిశుభ్రమైన
    నీటిని మాత్రమే వాడాలని గుర్తుపెట్టుకోండి.
Share.
Leave A Reply

Exit mobile version