రాత్రి నిద్ర పోవడం ఆలస్యం. ఉదయం లేవడం ఆలస్యం. లేచాక ఆఫీసుకో, కాలేజికో
టైం అయిపోతుందంటూ ఉరుకులు పరుగులు పెట్టడం. కాస్త అటు ఇటు తేడాగా దాదాపు అందరిదీ ఇదే జీవనశైలి. దీనివల్లే  చాలమందిలో విటమిన్డి కొరత ఏర్పడుతోంది అంటున్నాయి తాజా అధ్యయనాలు. జనాభాలోని 84 శాతం మందిలో విటమిన్డి కొరత ఉంది. కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత, హృదయకోశ వ్యాధులకు లోపమే కారణం. అందుకే తరచుగా శరీరంలో విటమిన్డి నిల్వలను పరీక్షించుకోవాలి. రోజూ కొద్దిసేపు శరీరంపై సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి. లేకపోతే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వెలువడే సూర్యకిరణాల్లో విటమిన్డి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు కాబట్టి ప్రతి రోజూ కొంత విటమిన్డిని శరీరానికి అందించండి.

Share.
Leave A Reply

Exit mobile version